రాహుల్ గాంధీకి మధ్యంతర బెయిల్

రాహుల్ గాంధీకి మధ్యంతర బెయిల్

మోదీ అనే ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేసినందుకు గాను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ న్యాయస్థానం రెండేళ్ల జైలుశిక్ష విధించడం తెలిసిందే.  ఈ కేసులోనే రాహుల్ కు జైలుశిక్ష పడింది. అయితే, ఈ పరువునష్టం కేసులో కింది కోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం రాహుల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ గడువును ఏప్రిల్ 13 వరకు విధించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 13కి వాయిదా వేసింది.