సేవను రాజకీయ కోణంలో చూడటం జీవన్ రెడ్డికి తగదు

సేవను రాజకీయ కోణంలో చూడటం జీవన్ రెడ్డికి తగదు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: స్వచ్చంద సేవాసంస్థలను, సేవాకార్యక్రమాలను రాజకీయ కోణంలో చూడటం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి తగదని ఎల్ ఎం కొప్పుల ట్రస్టు కోఆర్డినేటర్లు పేర్కొన్నారు. ధర్మపురి లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆగస్టు 5న పోలీస్ శాఖ , ఎల్ ఎం కొప్పుల సోషల్ సర్వీస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబోవు మెగా జాబ్ మేళా గురించి తప్పుగా మాట్లాడాటాన్ని ఖండించారు.

ప్రభుత్వ శాఖలు ఎన్ జి ఒ ల సహకారంతో ప్రజా సేవా కార్యక్రమాలు చేయటం సాధారణమైన విషయం అనీ దీనిని రాజకీయ కోణంలో చూస్తూ విమర్శించటం తగాదన్నారు. ఎల్ ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఒక స్వచ్చంద సంస్థ అనీ, ఈ సంస్థ ద్వారా విద్య, వైద్య సేవలు నిస్వార్థముగా ఈ ప్రాంతంలో నిరుపేదలకు అందిస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా వివిధ ఆర్గనైజేషన్ లతో కలిసి చేస్తున్న సేవా కార్యక్రమాలను జీవన్ రెడ్డి రాజకీయ కోణంలో ఆలోచన చేయటం వారికి గల అవగాహనా రాహిత్యానికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ ఎం కొప్పుల సోషల్ సర్వీస్ కో ఆర్డినేటర్లు మామిడాల రవీందర్, కుసుమ శంకర్, నక్క రాజు, గంగాధర రాజేశం, లక్ష్మణ్, రమాదేవి, స్వేచ్చ, సుమలత, కాంపెల్లి అపర్ణ, సత్యాచారి, రాజారామ్, జాడి శ్రీనివాస్, నూతి మల్లన్న, జూపాక సుదర్శన్, దుంపేటి రాజేశం తదితరులు పాల్గొన్నారు.