జనగామ రైల్వే స్టేషన్‌ పరిశీలించిన డీఆర్‌‌ఎం

జనగామ రైల్వే స్టేషన్‌ పరిశీలించిన డీఆర్‌‌ఎం

ముద్ర ప్రతినిధి, జనగామ: సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్‌‌ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన భరతేష్ కుమార్ జైన్ శనివారం జనగామ రైల్వే స్టేషన్‌ పరిశీలించారు. సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైల్‌లో వచ్చిన ఆయనకు స్థానిక రైల్వే అధికారులతో పాటు వివిధ పార్టీల లీడర్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో సిబ్బంది పనితీరుతో పాటు ప్లాట్‌ఫాం, స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. రెండో ఫ్లాట్‌ఫాం షెడ్‌ రేకులపై ఉన్న వర్షపునీరు, చెత్త పేరుకుపోవడంతో వాటిన వెంటనే క్లీన్‌ చేయించాలని ఆఫీసర్లను ఆదేశించారు.

స్టేషన్‌ బయట పార్కింగ్‌ పరిసరాలను పరిశీలించి అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. కాంగ్రెస్‌ లీడర్ల వినతి... జనగామ రైల్వే స్టేషన్‌కు వచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్ఎం భరతేష్ కుమార్ జైన్‌ ను పట్టణాకిని చెందిన కాంగ్రెస్‌ లీడర్లు కలిశారు. కొత్తగా నియామకం అయిన ఆయనకు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జనగామ రైల్వే స్టేషన్‌ ఉన్న పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్, బీసీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ చింతకింది మల్లేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ మాజీద్, సీనియర్ నాయకులు జాఫర్ షరీఫ్, సుల్తాన్ గోవింద్ రెడ్డి, పట్టణ అధికార ప్రతినిధి వేముల మల్లేష్, మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్షుడు అజారుద్దీన్, పట్టణ కాంగ్రెస్ నాయకులు రఘు ఠాగూర్, కొండ శ్రీను, సౌడ మహేష్, ఎండీ అజామ్ పాల్గొన్నారు.