పారిశుద్ధ కార్మికులకు ఆదివాసి దళిత హక్కుల పోరాట సమితి సంఘీభావం 

పారిశుద్ధ కార్మికులకు ఆదివాసి దళిత హక్కుల పోరాట సమితి సంఘీభావం 

ముద్ర, రాయికల్ : రాయికల్ మండల కేంద్రంలో పారిశుద్ధ కార్మికులకు చేస్తున్న సమ్మెలో ఆదివాసి దళిత హక్కుల పోరాట సమితి నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా  ఆదివాసి దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కురిసంగే వేణు మాట్లాడుతూ ఒకపక్క కరోనా కాలంలో కష్టాలను జయించి ఆకలితో అలుమటించి నిత్యం చెత్త ఎత్తిన పారిశుద్ధ కార్మికుల సమస్యలనుపరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. నిత్యం వారు చేస్తున్న సేవ అమోఘం వర్ణాతీతం అయినప్పటికిని వారికి ఉద్యోగ భద్రత,జీతాలు చెల్లించకపోవడం శోచనీయం. అయినా ఒకపక్క గత మూడు, నాలుగు నెలలుగా వారు జీతాలు లేకున్నా వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి పారిశుద్ధ పనులలో నిమగ్నమై పని చేస్తున్నారంటే వారిని ప్రధానమంత్రి ఒకనాడు అలహాబాద్ పుష్కరాల్లో కాళ్లు కడిగారు,ఇయ్యల రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గురించి పట్టించుకోకపోవడం ఎంతవరకు సభబో తెలంగాణ ప్రభుత్వానికే వదిలిస్తున్నామన్నారు. గొప్పలు చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం ఇవాళ్ళ స్వచ్చభారత్ అవార్డు మన రాష్ట్రానికి వచ్చిందంటే కార్మికులు స్వచ్ఛంగా చెత్తను ఎత్తడం వల్లనే అనే విషయాన్నీ గుర్తుంచుకోవాలని, ఇప్పటికైనా స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.