కాంగ్రెస్ పార్టీలో చేరికలు- కండువా కప్పి ఆహ్వానించిన పోన్నం

కాంగ్రెస్ పార్టీలో చేరికలు- కండువా కప్పి ఆహ్వానించిన పోన్నం
  • కాంగ్రెస్ తీర్థం  పుచ్చుకున్న బిజెపి మండల ఉపాధ్యక్షులు బోయిని వంశీకృష్ణ

చిగురుమామిడి ముద్ర న్యూస్: హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు రోజురోజు పెరుగుతున్నాయి. బిజెపి మండల ఉపాధ్యక్షులు బోయిని వంశి కృష్ణ తన అనుచరులతో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కండువా కప్పి ఆహ్వానించారు. అలాగే నవాబుపేట గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరారు.  ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ...  ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న నియోజకవర్గం ఆశించిన స్థా యిలో అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రతి కార్యకర్త పొన్నం ప్రభాకర్ అనే భావనతో పనిచేసి.. కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చాలన్నారు.నియోజకవర్గంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు అండగా నిలుస్తానని అన్నారు. రానున్న రోజుల్లో హుస్నాబాద్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కంది తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిమల్ల రవీందర్, జిల్లా అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, బీసీ , మైనార్టీ, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు పొన్నం సంపత్ షాబుద్దీన్, మైపాల్ రెడ్డి,బిసి సంక్షేమ సంఘం జిల్లా నాయకులు కంది నాగరాజు, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు ఠాకూర్ సాయి తేజేశ్వర్ సింగ్, నాయకులు బోయిన్ ప్రశాంత్, వేణు, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.