బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం..

బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం..
  • సీఎం కేసీఆర్  నాయకత్వంలోనే  చేతివృత్తులు, కులవృత్తుల వారికి చేయూత..
  • వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం..
  • - వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు..

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల :బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం జరుగుతుందని బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు  అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని ముదిరాజ్ సంఘం, సుతారి సంఘం, మోచి సంఘం,  పూసల సంఘం, శ్రీ రాజరాజేశ్వర కార్పెంటర్స్ సేవ్స్ సొసైటీ  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో  మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుల్కం  రాజులతో కలసి బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చల్మెడ లక్ష్మీ నరసింహా రావు   మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు  సంక్షేమ ఫలాలు సమానంగా అందించాలని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లి, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలని  సీఎం కేసీఆర్  అనుక్షణం పరితపిస్తున్నారని, ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, కుల వృత్తులను, చేతి వృత్తులను ప్రోత్సహిస్తూ వారు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారని అన్నారు.

వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బరిలో నిలుస్తున్నానని,  ఒక్కసారి అవకాశం ఇచ్చి,  ఆశీర్వదిస్తే వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా  ముదిరాజ్ కులస్తుల సంఘం భవనం, సుతారి కార్మికుల సమస్యల పరిష్కారం, కార్మిక సంఘం భవనం నిర్మాణంతో పాటు  మిగతా పెండింగ్ సమస్యల పరిష్కరానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో  కౌన్సిలర్లు మారం కుమార్, నిమ్మశెట్టి విజయ్, ఇప్పపూల అజయ్, కొండ కనకయ్య, బింగి మహేష్, జోగిని శంకర్,  నాయకులు నామాల లక్ష్మీరాజం,  జడల శ్రీనివాస్, గూడూరి మధు, సుతారి కార్మిక సంఘం నాయకుడు ముక్కెర రమేష్, ముదిరాజ్ సంఘం  అధ్యక్షుడు ఎదుల తిరుపతి, గౌరవ అధ్యక్షుడు పిల్లి మధు, ఉపాధ్యక్షుడు కనకయ్య , కార్పెంటర్స్ సంఘం అధ్యక్షుడు నాగభూషణం, సనుగుల సత్యం తదితరులు పాల్గొన్నారు.