సిఎం పదవికి కేసీఆర్ రాజీనామా

సిఎం పదవికి కేసీఆర్ రాజీనామా

కాన్వాయ్ లేకుండానే రాజ్ భవన్ కు వెళ్ళి కేసీఆర్

ముద్ర, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజ్ భవన్ కు కేసీఆర్ వెళ్ళి, గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. కాన్వాయ్ లేకుండానే ప్రగతి భవన్ నుంచి రాజ్ భవన్ కు కేసీఆర్ రెండు కార్లలోనే వెళ్ళడం గమనార్హం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా 2014 నుంచి పదేళ్ళుగా కేసీఆర్ ఉన్నారు. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైంది. కాంగ్రెస్ పార్టీకి 60కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. దీంతో కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.