వైద్య రంగంలో వచ్చిన నూతన టెక్నాలజీకి అనుగుణంగా వైద్య సేవలు

వైద్య రంగంలో వచ్చిన నూతన టెక్నాలజీకి అనుగుణంగా వైద్య సేవలు
  • సూర్యాపేటలో కార్డియాలజీ  చికిత్సలు అందుబాటులోకి రావడం సంతోషదాయకం

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-రాను రాను వైద్యరంగంలో వస్తున్న నూతన సాంకేతికను సాంకేతికతను అందిపుచ్చుకొని వైద్యరంగంలో తదనుగుణంగా వైద్య సేవలు లభించడం, కార్డియాలజీ విభాగంలో  అత్యాధునిక టెక్నాలజీతో సూర్యాపేటలో ఆసుపత్రిని ప్రారంభించి వైద్య సేవలు మొదలుపెట్టడం హర్షణీయమని సూర్యాపేట ఎమ్మెల్యే విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు గురువారం సూర్యాపేటలో కార్డియాలజిస్ట్ డాక్టర్ అలుక ప్రేమ్ కుమార్ గౌడ్ డాక్టర్ బెల్లంకొండ ప్రియాంక డాక్టర్ బెల్లంకొండ భరత్ గౌడ్ ల ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వెనుక సూర్యాపేట పబ్లిక్ స్కూల్ ఎదురుగా నూతనంగా నిర్మించిన ఆర్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫెర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు సూర్యాపేట నగరాలకు దీటుగా అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందుతుందని సూర్యాపేటలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేసుకున్నామని వివరించారు.

అత్యాధునిక వైద్య పరికరాలతో సూపర్ స్పెషాలిటీ సేవలతో 80 పడకల హాస్పిటల్ వెంటిలేటర్ 24 గంటల వైద్యశాల భయం అందుబాటులో ఉండటం అనేది గుండె సంబంధిత రోగులకు ఒక ఊరట లాంటిదని అత్యవసర సమయాల్లో హైదరాబాదుకు వెళ్లి చికిత్స చేయించుకోవడం ప్రయాసతో కూడుకున్నదని సూర్యాపేటలోనే హైదరాబాదు స్థాయి కార్డియాలజీ చికిత్సలు లభిస్తున్నందున గుండె సంబంధిత రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. సూర్యాపేటలోని గుండె స్టాండ్స్ వేయడం స్టంట్ వేయడం, క్యాథలాబ్ సర్వీసెస్ మేజర్, మైనర్ అన్ని రకాల ఆపరేషన్లు చేసే సౌకర్యాలు ఏర్పాటు చేయడం  లామినార్ ఫ్లో ఆపరేషన్ థియేటర్స్ తో అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం వల్ల సీరియస్ గా ఉన్న పేషంట్లకు త్వరగా ట్రీట్మెంట్ అందించే వీలు ఉంటుందని, కార్డియాలజీ న్యూరాలజీ గ్యాస్ట్రో ఎంట్రాలజీ యూరాలజీ జనరల్ మెడిసిన్ లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఐసీయూ, క్రిటికల్ కేర్, ఇన్ పెర్టిలిటీ, అబ్స్ట్రిక్స్ గైనకాలజీ విభాగాలలో కూడా చికిత్సలు అందించడం సూర్యాపేట ప్రాంత ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఆయన చెప్పారు ఇంకా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో, సుధాకర్ పివిసి ఎండి మీలా మహదేవ్, బెల్లంకొండ రామ్మూర్తి గౌడ్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్ జిల్లా గ్రంథాల సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, రాధాకృష్ణ గౌడ్ కార్డియాలజిస్ట్ అలుక ప్రేమ్ కుమార్ గౌడ్ ,స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు బెల్లంకొండ ప్రియాంక కీళ్ల వైద్య నిపుణులు బెల్లంకొండ భరత్ గౌడ్, డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్, నిరంజన్, తికుల్ల సాయి రెడ్డి, నిర్మల, రాణి, శ్రీధర్ గౌడ సంఘం నాయకులు బంధుమిత్రులు పాల్గొన్నారు.