గ్రేటర్ వాసులకు శుభవార్త... సిద్ధమవుతున్న కొత్త ఎంఎంటీఎస్ లైన్లు..!

గ్రేటర్ వాసులకు శుభవార్త... సిద్ధమవుతున్న కొత్త ఎంఎంటీఎస్ లైన్లు..!
  • మోడీ చేతుల మీదుగా సనత్‌ నగర్‌ - మౌలాలి మార్గం ప్రారంభం 

ముద్ర,హైదరాబాద్:- హైదరాబాద్ నగర నలుమూలల నుంచి అందుబాటులో ఉన్న ఎంఎంటీఎస్‌ సేవలు మరింత విస్తృతం చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. మౌలాలి నుంచి సనత్‌నగర్ల మధ్య ఎంఎంటీఎస్ రైలు అందుబాటులోకి రానుంది.దీంతో మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు హైటెక్‌సిటీ మార్గం సుగుమమం కానుంది. నియోజకవర్గంలోని కాలనీలు, బస్తీలకు తక్కువ ఛార్జీలతో ప్రయాణం పొందే అవకాశం లభించనుంది. ఇప్పటికే భాగంగా ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు పూర్తయ్యాయి. తాజాగా సనత్‌నగర్‌-మౌలాలి లైన్‌ సిద్ధమైంది. రక్షణశాఖ-రైల్వే శాఖల మధ్య రెండో లైను నిర్మాణానికి ఉన్న ఆటంకాలు తొలగడంతో పనులు శరవేగంగా పూర్తయ్యాయి.

ఇందులో భాగంగా మొత్తం 95 కిలోమీటర్ల మేర కొత్త మార్గం అందుబాటులోకి వచ్చింది. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ ప్రారంభోత్సవానికి మార్చి మొదటి వారంలో ప్రధాని నరేంద్రమోడీ రానున్న నేపథ్యంలో సనత్‌ నగర్‌-మౌలాలి మార్గాన్ని ప్రారంభించనున్నారు. అయితే మరో ఎంఎంటీఎస్‌ మార్గమైన సికింద్రాబాద్‌-ఘట్‌కేసర్‌ లైన్‌ కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ రెండు లైన్లు అందుబాటులోకి వస్తే నగర ప్రజల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు పేరుకు హైదరాబాద్‌లో ఉన్నా సొంతిళ్లకు దూరంగా ఉంటూ కంపెనీలకు సమీపంలో అద్దె తీసుకొని ఉండే పరిస్థితి వచ్చింది. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన మౌలాలి-సనత్‌నగర్ ఎంఎంటీఎస్ మార్గంతో ఐటీ ఉద్యోగులకు ప్రయాణ సమయం తగ్గనుంది.