నేరపూరిత కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నవారిపైనా వేటు

నేరపూరిత కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నవారిపైనా వేటు

నేరపూరిత కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నవారిపైనా వేటు. ఎన్నికల్లో నిషేధం విధించేలా సీఈసీ తీవ్ర కసరత్తు చేస్తోంది.  పలు కీలక ప్రతిపాదనలు రూపొందించిన సీఈసీ. ఇప్పటివరకు శిక్ష ఆధారంగానే ఎన్నికల్లో పోటీకి అనర్హత. రాజకీయాల్లో నేర ప్రవృత్తి అరికట్టడానికే ప్రతిపాదనలు అంటున్న సీఈసీ. ఐదేళ్ళు, అంతకుమించి జైలు శిక్షకు అవకాశం ఉన్న కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నవారిని అనర్హత జాబితాలో చేర్చాలని ఈసీ ప్రతిపాదించింది.  ఇప్పటివరకు నేరపూరిత కేసుల్లో రెండేళ్ళు, అంతకుమించి శిక్షపడినవారు మాత్రమే ఎన్నికల్లో పోటీకి అనర్హులు. తమ ప్రతిపాదనలను అత్యన్నత న్యాయస్థానం ముందు ఉంచిన ఈసీ. రాహుల్​పై అనర్హత వేటు నేపథ్యంలో ఈసీ ప్రతిపాదనలకు ప్రాధాన్యత.