పాత ఎమ్మెల్యేలు కూడా ప్రమాణస్వీకారంలో తప్పులు

పాత ఎమ్మెల్యేలు కూడా ప్రమాణస్వీకారంలో తప్పులు

సభా నియామకాలు..!!

రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం సందర్భంగా కొత్త చర్చ తెరపైకి వచ్చింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలే కాకుండా.. పాత ఎమ్మెల్యేలు కూడా ప్రమాణస్వీకారంలో తప్పులు చేశారు. సభా నియమాలు అంటూ చెప్పకుండా.. సభా నియమాకాలకు కట్టుబడి ఉంటానని అంటూ ఉచ్చరించారు. నిజానికి, గతంలో రాజ్యసభలో ఇలాంటి తప్పులపై పెద్ద రాద్ధాంతమే నడిచింది. ఎందుకంటే, రాజ్యసభ సభ్యుడిగా ప్రముఖ నటుడు విజయేంద్రప్రసాద్​ ప్రమాణస్వీకారం చేస్తూ ఒక చివరలో భారత్​మాతాకీ జై అంటూ నినదించారు. ప్రమాణస్వీకారంలో ఇది సహించం అంటూ అప్పటి చైర్మన్​వెంకయ్యనాయుడు.. విజయేంద్రప్రసాద్​తో తిరిగి ప్రమాణస్వీకారం చేయించారు. 


అయితే, రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు పదేపదే నిధులు, నియామకాలు, నీళ్లు అంటూ ప్రచారం చేయడం, విమర్శలు చేసుకోవడంతో అదే ఊతపదంగా మారింది. దీంతో సభా నియమాలు కట్టుబడి ఉంటాం, పాటిస్తాం అని కాకుండా.. సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని, పాటిస్తానని అంటూ ప్రమాణస్వీకారం చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఇదే ఉచ్చరించారు. దీనిపై ఇటు అధికారులు, అటు సోషల్​ మీడియాలో వీడియోలు వైరల్​ అవుతున్నాయి. ప్రొటెం స్పీకర్​గా అక్బర్​ ఉండటం, ఆయనకు తెలుగు భాషాపై పట్టు లేకపోవడంతో.. తప్పుగా ప్రమాణస్వీకారం చేసినా పొరపాటుగా తీసుకోలేదంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు.