ప్రజా కంటక మతోన్మాద పాలనకు ప్రజలు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలి....

ప్రజా కంటక మతోన్మాద పాలనకు ప్రజలు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలి....

సిపిఎం పార్టీ మండల కార్యాలయ శంకుస్థాపనలో కేంద్ర నాయకులు చేరుపల్లి పిలుపు.....

తుర్కపల్లి ( ముద్ర న్యూస్ ): కేంద్రంలోని ప్రజా కంటక మతోన్మాద పాలనకు ప్రజలు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని సిపిఎం కేంద్ర నాయకులు మరియు మాజీ శాసనమండలి సభ్యులు చేరుపల్లి సీతారాములు ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో మండల సిపిఎం పార్టీ కార్యాలయ శంకుస్థాపనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్. కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశంతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాలు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ. ప్రజా సమస్యల పరిష్కార కేంద్రంగా పనిచేయాలని అన్నారు.

ప్రజలను మతం పేరుతో చీల్చుతూ. దేశ సంపదను మొత్తం కార్పోరేట్లకు కట్టబెడుతూ. ఆదానిని ప్రపంచ ధనికులలో మూడో స్థానంలో నిలబెట్టిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నిజస్వరూపం గుజరాత్ మారణకాండ కు కారణం అని తెలుపుతూ బిబిసి డాక్యుమెంటరీ విడుదల చేసిందని చెప్పారు. దాన్ని బిజెపి రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. మోడీ ప్రధానమంత్రి కాకముందు మామూలు వ్యాపారవేత్తగా ఉన్న గౌతమ్ ఆదానే నేడు 12 లక్షల కోట్లకు చేరుకున్నాడని. ఇలా ఒక శాతం మంది వద్దనే దేశంలో 70 కోట్ల మంది ప్రజలకు సమానమైన ఆస్తులు ఉన్నాయని వివరించారు.  

ప్రజలను నిత్యం చైతన్యవంతం చేసే పనిలో కమ్యూనిస్టు కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మండలంలోని ముల్కలపల్లి లో గత ఎంపిటిసి సభ్యురాలుగా పోటీ చేసిన భూక్య లక్ష్మి తో పాటు భూక్య శ్రీను నాయక్ లు ఆయన సమక్షంలో సిపిఎం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు మెడలో కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్. సీనియర్ నాయకులు కొక్కొండ లింగయ్య. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు లావుడియా రాజు, గంధమల్ల మాతయ్య,దార్ల దుర్గయ్య,ఆవుల కలమ్మ, వెంకటేశం,నాగరాజు, మంత్రి నరసింహ