బడ్జెట్ లో చేనేతకు మొండిచేయి : చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాద్యక్షులు కట్కం వెంకటేష్

బడ్జెట్ లో చేనేతకు మొండిచేయి : చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాద్యక్షులు కట్కం వెంకటేష్

రాజాపేట ఫిబ్రవరి 1 (ముద్ర న్యూస్)బడ్జెట్ లో చేనేతకు మొండిచేయి చూపించారని,2023-24  కేంద్ర బడ్జెట్ చేనేతలకు నిరాశపరిచిందని జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర  ఉపాధ్యక్షులు కట్కం వెంకటేష్ నేత అన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం నేతన్నలను ఆదుకుంటుందని అనుకున్న సమయంలో గతేడాది కంటే తక్కువ నిధులు కేటాయించి మొండిచేయి చూపించందని విమర్శించారు.

బడ్జెట్‌లో చేనేతల పట్ల బిజెపి ప్రభుత్వం అనుసరించిన తీరుపై ఆయన మాట్లాడారు.2022-23 లో  200 కోట్ల రూపాయలు కేటాయించన ప్రభుత్వం ఈ ఏడు అంతకంటే తక్కువగా కేటాయించడం చేనేతల పట్ల చిత్తశుద్ధి లేదని అనడానికి నిదర్శనం అని వివరించారు. గతేడాది ప్రకటించిన బడ్జెట్ లో ఖర్చు పెట్టిన రూపాయలు ఎంతో నేటికి తెలియదని వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేనేతలపై కేంద్ర ప్రభుత్వం  నిర్లక్ష్యాన్ని నేతన్నలు గుర్తుంచుకోవాలని కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.