చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ లాంకోహిల్స్ లో నిరసన

చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ లాంకోహిల్స్ లో నిరసన

ముద్ర, హైదరాబాద్: చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ లాంకో హిల్స్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద శనివారం రాత్రి విజిల్ ఊది తమ నిరసనను తెలియజేశారు.

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు పిలుపుమేరకు మోత మోగిద్దాం కార్యక్రమం ద్వారా రాత్రి 7 గంటల ఐదు నిమిషాల నుండి ఐదు నిమిషాల పాటు ఈ కార్యక్రమం జరిగింది. ఛాయా రమేష్, కిరణ్ కుమార్, సాయి, సుధీర్, తిలక్, రోహిణి తదితరులు నాయకత్వం వహించారు.