సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల... 7 దశల్లో పోలింగ్ నిర్వహణ

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల... 7 దశల్లో పోలింగ్ నిర్వహణ

ముద్ర,సెంట్రల్ డెస్క్:- దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేసింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సీఈసీ రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్లతో కలిసి ఈ షెడ్యూల్ ను విడుదల చేశారు.దేశ వ్యాప్తంగా మొత్తం 7 దశల్లో లోక్సభ ఎన్నికలు పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది.

మొదటి దశ పోలింగ్ - ఏప్రిల్ 19
రెండవ దశ పోలింగ్ - ఏప్రిల్ 26
మూడవ దశ పోలింగ్ - మే 7
నాల్గవ దశ పోలింగ్ - మే 13
ఐదవ దశ పోలింగ్ - మే 20
ఆరవ దశ పోలింగ్ - మే 25
ఏడవ దశ పోలింగ్ - జూన్ 1

ఫలితాలు - జూన్ 4