టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ నిందితుల ఆర్ధిక లావాదేవీలపై సిట్ ఆరా

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ నిందితుల ఆర్ధిక లావాదేవీలపై సిట్ ఆరా

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో  నిందితుల  ఆర్ధిక లావాదేవీలపై  సిట్  బృందం  ఆరా తీస్తోంది.   ప్రశ్నాపత్రం  లీక్ కేసులో  నిందితులను కోర్టు   సిట్  కస్టడీకి  ఇచ్చింది.  ఈ నెల  18వ తేదీ నుండి  నిందితులను  సిట్  బృందం  కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తోంది.  ఆదివారం రెండో  రోజున  సిట్  బృందం   నిందితులను  విచాస్తోంది. 2022  అక్టోబర్  మాసం  నుండి  జరిగిన  ఏడు పరీక్షలపై  కూడా  సిట్ బృందం  ఫోకస్ పెట్టింది.  ఈ ఏడు  పరీక్షల్లో అత్యధిక మార్కులు  వచ్చిన  అభ్యర్ధులపై   సిట్  ఫోకస్  చేయనుంది. ఈ ఏడు  పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు ఏమైనా లీకయ్యాయా  అనే కోణంలో కూడా  సిట్ బృందం  దర్యాప్తు  చేయనుంది.  గత ఏడాది అక్టోబర్ నుండి  ఇప్పటివరకు  ఏడు  పరీక్షలు  నిర్వహించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.  ఫుడ్ సేప్టీ ఆఫీసర్,  సీపీడీఓ,  సూపర్ వైజర్  గ్రేడ్  2,  ఏఈఈ , డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్,  ఏఈ పరీక్షల నిర్వహించారు.  అయితే  ఇప్పటికే  ఏఈ  పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైందని  సిట్  బృందం  గుర్తించింది.

మిగిలిన  పరీక్షలు జరిగిన తీరుపై  కూడా పోలీసులు  ఫోకస్ పెట్టారు.  గ్రూప్-1 ప్రిలిమ్స్  , ఏఈఈ, డీఏఓ పరీక్షలను  రద్దు  చేస్తున్నట్టుగా  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు  రోజుల క్రితం  ప్రకటించింది.   ఈ నెల  5వ తేదీన జరిగిన  ఏఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రంతో పాటు  మరో నాలుగు ప్రశ్నాపత్రాలను  కూడా  ప్రవీణ్  పెన్ డ్రైవ్ లో  డౌన్ లోడ్  చేసుకున్నారని సిట్ బృందం  గుర్తించింది.  పేపర్ లీక్ కేసులో  ప్రవీణ్, రాజశేఖర్ లు  కీలకంగా  వ్యవహరించినట్టుగా   సిట్  బృందం గుర్తించింది.    టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ కేసులో  ఇప్పటికే  తొమ్మిది మందిని  పోలీసులు అరెస్ట్  చేశారు.  ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లాకు  చెందిన  రేణుక   కొందరికి  ఈ పేపర్ ను విక్రయించినట్టుగా  పోలీసులు గుర్తించారు.   పేపర్ లీక్ కేసులో  లావాదేవీల  విషయంలో  చోటు  చేసుకున్న  విబేధాల  కారణంగానే నే విషయం వెలుగు చూసిందని  పోలీసులు గుర్తించారు.