సీనియర్ జర్నలిస్టు రాజేశ్వరరావు కన్నుమూత

సీనియర్ జర్నలిస్టు రాజేశ్వరరావు కన్నుమూత

సీనియర్ జర్నలిస్టు సిహెచ్ రాజేశ్వరరావు సోమవారం రాత్రి హైదరాబాదులో కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజేశ్వరరావు ఆయనకు ప్రెస్ అడ్వైజర్ గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు ( ఏపీఎస్ఈబీ)కి కూడా ఆయన సలహాదారుగా వ్యవహరించారు. దీర్ఘకాలం ఆంధ్ర పత్రికలో రిపోర్టర్ గా పనిచేసిన రాజేశ్వరరావు ఆ తర్వాత ఢిల్లీలో ఇండియన్ ఎక్స్ ప్రెస్, దక్కన్ క్రానికల్ పత్రికలకు పనిచేశారు. మన తెలంగాణ పత్రికకు ఒంబుడ్స్ మన్ గానూ, హెచ్ఎంటీవీ సలహాదారుగానూ రాజేశ్వరరావు పని చేశారు.

రాజేశ్వరరావు మృతికి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశాయి. ఐజేయూ అధ్యక్షుడు కే శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కే విరాహత్ అలీ ఒక ప్రకటనలో రాజేశ్వరరావు మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటని వారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ వేరొక ప్రకటనలో రాజేశ్వర రావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. పాత్రికేయ రంగానికి ఆయన చేసిన సేవలను అమర్ ప్రశంసించారు.

ఏపీడబ్ల్యూజే సంతాపం

నాగేశ్వరరావు మృతి పట్ల ఏపీయూడబ్ల్యుజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ వి సుబ్బారావు చందు జనార్ధన్, ఐజేయు ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు ఓ ప్రకటనలో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.