ఉత్తమ కౌన్సిలర్ గా హనుమడ్ల జయశ్రీకి సేవ రత్న పురస్కారం 

ఉత్తమ కౌన్సిలర్ గా హనుమడ్ల జయశ్రీకి సేవ రత్న పురస్కారం 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మదర్ థెరిస్సా సేవ సమితి అద్వర్యంలో హైదరాబాదులోని కోఠి తిలక్ రోడ్ లో డా.దేవులపల్లి రామానుజరావు కళామందిరం లో ఏర్పాటు చేసిన జాతీయ సేవా రత్న పురస్కారాలు -2023లో  ఉత్తమ సేవకురాలు బెస్ట్ కౌన్సిలర్ గా జగిత్యాల పట్టణానికి చెందిన కౌన్సిలర్ హనుమడ్ల జయశ్రీని ఎంపిక అవార్డుతో సత్కరించారు.

ఈ సందర్బంగా సంస్థ పౌండర్ చైర్మన్ తంగిరాల ఇర్మియ, గౌరవ సలహాదారుడు రచయిత అభిరామ్ మాట్లాడుతూ  ఈ అవార్డ్ ను రెండు తెలుగు రాష్ట్రలలో వివిధ రంగాల్లో నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేసిన వాళ్ళను ఎంపిక చేయడం జరిగిందని అని అన్నారు. అందులో భాగంగానే జగిత్యాల కు చెందిన హనుమండ్ల జయశ్రీ  ఎంపిక చేశామని, రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు ఇండిపెండెంట్ కౌన్సిలర్ కొనసాగుతూ ప్రజల పక్షాన ఆమె పోరాడుతుంది ఆమె ఒకే ఒక్కరు అన్నారు. సోషల్ మీడియా, వివిధ దిన పత్రికలలో గుర్తించి మదర్ థెరిస్సా సేవ సమితి 17 వ వార్షికోత్సవ సందర్భంగా జాతీయ సేవ రత్న పురస్కారం ఇవ్వడం జరిగిందని అన్నారు.