ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. హత్య

ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. హత్య

ముద్ర, తెలంగాణ వార్తలు: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలిక (6 Years Old Girl) పై ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి హత్య (murder) చేశాడు. నిందితుడిని బీహార్ కు చెందిన బలరాంగా పోలీసులు గుర్తించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకోడానికి గాలింపు చర్యలు మొదలు పెట్టారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అత్యాచారం చేసిన తర్వాత ఆ చిన్నారి బతికి ఉంటే ఎక్కడ విషయం బయటపడుతోందోనన్న భయంతో దారుణంగా చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ కూతురు నిర్జీవంగా పడి ఉండడం చూసిన తల్లిదండ్రులు గుండెలు బాదుకుని రోధిస్తున్నారు. ఆ నిందితుడికి పట్టుకుని కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.