బీఆర్ఎస్ పార్టీ తోనే యువత భవిష్యత్తు

బీఆర్ఎస్ పార్టీ తోనే యువత భవిష్యత్తు
  • రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో  చేసిన అభివృద్ధి చూసి యువత టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం ఆయన నివాసంలో నియోజకవర్గం పరిధిలోని యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి గులాబీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ తెలంగాణ రాకపోతే అభివృద్ధి జరిగేదా ఆలోచించండి అన్నారు.నగర రూపురేఖలు మార్చాం ఇతర రాష్ట్రాల నుండి కరీంనగర్ కు వలసలు వస్తున్నారని చెప్పారు.ఓటు తప్పుగా వేస్తే భవిష్యత్ తరాలు ఇబ్బందుల్లో పడతాయి అన్నారు.బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు.అభివృద్ధి కొనసాగాలంటే కెసిఆర్ చేతులను బలోపేతం చేయండని కోరారు.తెచ్చుకున్న తెలంగాణ ఢిల్లీ దొంగల చేతిలో పెట్టకండి అన్నారు.అందరం కలిసి మెలిసి ఉంటేనే నగరం అభివృద్ధి ముందుకు సాగుతుందని అభిప్రాయ పడ్డారు.పదేళ్లలో నగరం ప్రశాంతంగా ఉంది ఇది కొనసాగాలంటే విలువైన ఓటు కెసిఆర్ కు వేసి మా చేతులు బలోపేతం చేయండి.మరోసారి గెలిపిస్తే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానన్నారు.