సూర్యాపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత జగదీశ్ రెడ్డి ని అత్యధిక ఓట్లతో గెలిపించాలి.

సూర్యాపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత జగదీశ్ రెడ్డి ని అత్యధిక ఓట్లతో గెలిపించాలి.
  • తల్లమల్ల హసేన్ సీనియర్ న్యాయవాది దళిత నాయకులు


ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-గత తొమ్మిది సంవత్సరాలుగా సూర్యాపేట నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తూ, కుల , మతాలకు , వర్గాలకు, పార్టీలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో వ్యాపారస్తులు పనిచేయుటకు వారిని ప్రోత్సహిస్తూ నియోజకవర్గ  సమగ్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయుచున్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీనియర్ న్యాయవాదులు తల్లమల్ల హసేన్, జిలకర చంద్రమౌళి దళితులను కోరినారు.  శుక్రవారము ఆత్మకూరు ఎస్ మండలం మిడతనపల్లి, రామన్నగూడెం, నసీంపేట  గ్రామాల దళిత వాడలలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, దళితుల అభివృద్ధి, సంక్షేమం, దళిత బంధు పథకం , బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో గురించి వివరించారు.ఈ పర్యటనలో దళిత నాయకులు గోలి సాంబయ్య, దాసరి దేవయ్య, గాజుల నరసయ్య, నామా వేణు, గ్రామ సర్పంచులు, వార్డ్ మెంబర్స్, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.