గద్దర్ కు ఘన నివాళి

గద్దర్ కు ఘన నివాళి

మెట్‌పల్లి ముద్ర:- విప్లవ కారుడు, ప్రజా గాయకుడు యుద్దనౌక అమర వీరుడు గద్దర్  కు ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. అంబేడ్కర్ పార్క్ లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గద్దర్ చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గద్దర్ ప్రాణాలు విడిచే వరకూ దొర పెత్తందారుల భూస్వాముల చేతిలో బడుగు బలహీనవర్గాలు బందీలు కాకుండా ఉండేందుకోసం తన పాట ద్వారా చైతన్యాన్ని రగిలిస్తానని పలు వేదికల సాక్షిగా వ్యాఖ్యానించారని. తను ప్రాణం విడిచే వరకు పాటను వదిలేయలేదు అన్నారు.మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో ఆయన చేసిన పోరాటం వర్ణించలేనిది అన్నారు. గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రధాన సానుభూతిని తెలియజేశారు. ఆల్ ఇండియా అంబెడ్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి నెరేళ్ల శ్రీధర్,డివిజన్ అధ్యక్షులు మ్యాకల తుక్కారం, డివిజన్ ఉపాధ్యక్షులు మ్యాకల ఉదయ్,నాయకులు మ్యాకల హన్మాండ్లు,మండలాధ్యక్షులు గోరుమంతుల ప్రవీణ్ కుమార్,వేంపెట్ అధ్యక్షులు మ్యాదరి గణేష్,నాయకులు బత్తుల భరత్, కారం శివ లు ఉన్నారు.