ప్రకాశ్ అంబేడ్కర్ కు స్వాగతం

ప్రకాశ్ అంబేడ్కర్ కు స్వాగతం

డా. బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి ఆవిష్కరిస్తున్న.. ప్రపంచంలోనే అతి పెద్దదయిన 125 అడుగుల అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరవుతున్న...బాబాసాహెబ్ అంబేద్కర్ మనుమడు, మాజీ లోక్ సభ సభ్యులు ప్రకాశ్ అంబేద్కర్ కాసేపటి క్రితం ప్రగతి భవన్ కు చేరుకున్నారు. 

తన ఆహ్వానం మేరకు ప్రగతి భవన్ కు చేరుకున్న ప్రకాశ్ అంబేద్కర్ గారిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సాదరంగా ఆహ్వానించారు. శాలువాతో ఘనంగా సత్కరించి పూలగుచ్చమందించారు. అనంతరం వారితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనంతరం మధ్యాహ్నం భోజనంతో వారికి అతిథ్యమిచ్చారు. 

ఈ సందర్భంగా.... ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, పార్టీనేతలు దాసోజు శ్రవణ్, శంకర్ అన్న ధోంగే.., సిద్దోజీరావు తదితరులున్నారు.

మరి కాసేపట్లో ప్రకాశ్ అంబేద్కర్ ను తోడ్కొని, డా. బిఆర్ అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సిఎం కేసీఆర్ బయలుదేరనున్నారు.