ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్... రంగంలోకి సీబీఐ

ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్... రంగంలోకి సీబీఐ

ముద్ర,సెంట్రల్ డెస్క్:-ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవితను విచారించేందు సీబీఐ సిద్ధమైంది. ఈ క్రమంలో కవితను విచారించేందుకు కోర్టును అనుమతి కోరింది. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మరో వైపు ఇదే కేసులో విచారించేందుకు సీబీఐ ఎమ్మెల్సీ కవితకు పలుమార్లు నోటీసులు పంపించగా.. కవిత మాత్రం సీబీఐ నోటీసులు పట్టించుకోకుండా విచారణకు హాజరు కాలేదు.