తెలంగాణలో పారిశుద్ధ్య కార్మికులకు సముచిత గౌరవం- మేయర్ వై సునీల్ రావు

తెలంగాణలో పారిశుద్ధ్య కార్మికులకు సముచిత గౌరవం- మేయర్ వై సునీల్ రావు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులు గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారని కరీంనగర్ మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సానిటేషన్ కార్మికులపై కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అనాలోచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కంటే తెలంగాణ లో పారిశుద్ధ్య కార్మికుల జీతాలు రెండు రెట్లు అదనంగా ఇస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం వరకు పారిశుద్ధ్య కార్మికులను అంటరాని వారిగా చూశారని, కార్మికునికి కేవలం 6700 మాత్రమే జీతం మాత్రమే చెల్లించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో 16,600 జీతం చెల్లిస్తూ పారిశుద్ధ్య కార్మికులకు సముచిత గౌరవం ఇస్తున్నామని తెలిపారు. 30% పిఆర్సి తో పాటు ఆరునెలల ఏరియర్స్ ఇచ్చిన ఘనత కేసిఆర్ అని వెల్లడించారు. దురదృష్టవశాత్తు కార్మికుడు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించడం కొరకు ప్రత్యేక జీవో తీసుకువచ్చిన ఘనత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు దక్కుతుందని స్పష్టం చేశారు. కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తుందని వెల్లడించారు. శానిటేషన్ కార్మికులపై బండి వ్యాఖ్యలను ఎవరు నమ్మేస్థితిలో లేరని తెలిపారు. బిజెపి పాలిత రాష్ట్రాలతో తెలంగాణ అభివృద్ధిని బేరీజు వేసుకొని మాట్లాడాలని హితువు పలికారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, గంట కళ్యాణి శ్రీనివాస్ తుల బాలయ్య, కో ఆప్షన్ మెంబర్ నందెల్లి రమ, నాయకులు మైకేల్ శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు.