స్కంద మాత గా సరస్వతి అమ్మవారు 

స్కంద మాత గా సరస్వతి అమ్మవారు 

బాసర, ముద్ర:-నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అయిదో రోజు గురువారం అమ్మవారు స్కంద మాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్కంద భగవానుడి తల్లి అయినందున ఈ రూపాన్ని స్కందమాతగా భావిస్తారు. వేకువ జామునే ఆలయ అర్చకులు, వేద పండితులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి, పెరుగన్నం నైవేద్యంగా సమర్పించారు.నేడు అమ్మవారి జన్మ నక్షత్రమైన  మూల నక్షత్రం కావడంతో  భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుందనీ ఆలయ ఈఓ తెలిపారు. అందుకోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు.