వంగి పోతున్న విద్యుత్ స్తంభం

వంగి పోతున్న విద్యుత్ స్తంభం

ముద్ర మోతె : మండల కేంద్రం లోని యస్సి కాలనీ లో ఉన్న ఒక విద్యుత్ స్తంభం వంగి పోయి ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు పలువురు గ్రామ పంచాయతీ కార్యదర్శి కి విద్యుత్ అధికారులకు విన్నవించినప్పటికి ఏ ఒక్కరు స్పందించడం లేదని వీధిలోని నిరంతరం చిన్న పిల్లలు ఆడుకోవడం తో పాటు నాలుగు వీధులకు కూడలి గా ఉండటం తో పక్కనే పశువులు కట్టివేయడం విద్యుత్ లైన్ క్రిందనే ఇండ్లు నిర్మించి ఉన్నాయని ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నట్లు ముద్ర ప్రతినిధి తో చెప్పారు .

గురిజాల కోటమ్మ విద్యుత్ స్తం భం ప్రక్కన ఇల్లు యజమాని  వివరణ ఎప్పుడు గాలి వచ్చి కూలి పడుతుందో రోజు రోజు కు భయం తో వణికి పోతున్నామని ఎన్ని సార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.