ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలి

ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలి
  • ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలి.
  • అబద్ధపు అవినీతి బీఆర్ఎస్ కి ఓటు వేయకండి-తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం నాయకులు మాజీ ఐఏఎస్ ఆకునూరు మురళి.

హుజూర్ నగర్ ముద్ర: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఓటరు తప్పకుండా ఓటు వేయాలని అదేవిధంగా అబద్ధపు అవినీతి బీఆర్ఎస్ పార్టీకి ఏ ఒక్కరు కూడా ఓటు వేయొద్దని తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం నాయకులు మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి కోరారు.

ఆదివారం పట్టణంలో పర్యటించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను మోసం చేసిందని పట్టణంలోని ఫణిగిరి రామస్వామి గట్టు దగ్గర నిర్మించిన మోడల్ కాలనీ లోని 2000 పైచిలుకు ఇండ్లని కాంగ్రెస్ కి లబ్ధి చేకూరుతుందనే దురుద్దేశంతోనే ఇళ్లు లేని అర్హులకి ఇవ్వలేదని రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ అవినీతి చేసిందని ఆరోపించారు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయద్దు అని ప్రజలందరినీ కోరుతానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీఎస్ డీఎస్ నాయకులు వినాయకరావు, చలపతిరావు పాల్గొన్నారు.