బిజెపి, బిఆర్ ఎస్ పార్టీలను ఓడించాలి. 

బిజెపి, బిఆర్ ఎస్ పార్టీలను ఓడించాలి. 
  • సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్, కోదాడ స్థానాల్లో పోటీ చేస్తాం... 
  • సూర్యాపేట,తుంగతుర్తి నియోజకవర్గాల గురించి త్వరలో చర్చించి నిర్ణయిస్తాం.. 
  • సిపిఎం జిల్లా కమిటీ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: సూర్యాపేట: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోబిజెపి,బిఆర్ఎస్ పార్టీలను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలోఆయన మాట్లాడుతూమతోన్మాదంవిధానాలు అనుసరిస్తున్నబిజెపిని ఓడించాలని అన్నారు. గత పది సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నబిఆర్ఎస్ పార్టీని ఘోరంగా ఓడించాలన్నారు . సూర్యాపేట జిల్లాలో సిపిఎం పార్టీకి  బలమున ఓటు బ్యాంకు కలిగి ఉన్న స్థానాలైన హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలలో చేస్తామన్నారు.  సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలలో పోటీ  గురించి త్వరలో చర్చించిచెబుతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత 17 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు తెలిపారు. మరో రెండు రోజుల్లోమిగతా స్థానాల తో పాటు పోటీ చేసే అభ్యర్థులను రాష్ట్ర కమిటీ ప్రకటిస్తుందన్నారు. ప్రశ్నించే గొంతులకు ప్రజలు ఓటు వేసి గెలిపించాలనివిజ్ఞప్తి చేశారు. చట్ట సభలలో కమ్యూనిస్టుల కు చోటు లేకపోవడం మూలంగా ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదన్నారు. కమ్యూనిస్టు అభ్యర్థులు చట్ట సభలలో  ఉండటం మూలంగా కార్మికుల, రైతుల, ఉద్యోగ, ఉపాధ్యాయ,మహిళల, యువకుల, దళిత గిరిజన బడుగు బలహీనవర్గాల సమస్యలపై గళం ఎత్తటానికి అవకాశం ఉంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులకు అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దిరావత్ రవి నాయక్, బుర్రి శ్రీరాములు, మట్టి పెళ్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, నగరపు పాండు, చెరుకు ఏకలక్ష్మి, కోట గోపి, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.