బీఆర్ఎస్  పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన జెర్రిపోతుల గూడెం  సర్పంచ్ నల్లబోలు సుజాత శ్రీనివాస్ రెడ్డి

బీఆర్ఎస్  పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన జెర్రిపోతుల గూడెం  సర్పంచ్ నల్లబోలు సుజాత శ్రీనివాస్ రెడ్డి

చిలుకూరు ముద్ర : చిలుకూరు మండలం జెర్రిపోతుల గూడెం గ్రామ సర్పంచ్ సుజాత శ్రీనివాస్ రెడ్డి బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్ల మాద పద్మావతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనపల్లి  చందర్రావు   వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు, వారితోపాటు దాదాపు 100 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి  పద్మావతి రెడ్డి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆరు గ్యారెంటీలను  తప్పక అమలు చేస్తామని, కాంగ్రెస్ పార్టీ వస్తేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని, బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినంక కాంట్రాక్టర్లు దళార్లు బాగుపడ్డారు కానీ పేదలకు చేసింది ఏమీ లేదని ఆమె అన్నారు, ఈ కార్యక్రమంలో చిలుకూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు,