నర్సాపూర్ లో మంత్రి ఇంద్రకరణ్ కాన్వాయ్ ని  అడ్డుకున్న బిజెపి నేతలు - అదుపులోకి తీసుకున్న పోలీసులు

నర్సాపూర్ లో మంత్రి ఇంద్రకరణ్ కాన్వాయ్ ని  అడ్డుకున్న బిజెపి నేతలు - అదుపులోకి తీసుకున్న పోలీసులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇటీవల పేపర్ లీకేజీల విషయంలో ఇంద్రకరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపుతున్నాయి. తాజాగా గురువారం నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్ జి మండల కేంద్రంలో బిజెపి నేతలు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయ్ ని అడ్డుకోవడమే కాకుండా  ఆయన వ్యతిరేకంగా నినాదాలు చేశారు.దీని మూలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాల నేపథ్యంలో గురువారం నర్సాపూర్- జి మండల కేంద్రంలో జరిగే సమ్మేళనానికి వెళుతున్న ఇంద్రకరణ్ రెడ్డిని అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. పేపర్ల లీకేజీ సర్వసాధారణమని ఆయన చేసిన వ్యాఖ్యలు నిరుద్యోగులను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి చేసి ఆందోళనకారులను అదుపులకు తీసుకున్నారు.