బెడిసి కొట్టిన వ్యూహం 

బెడిసి కొట్టిన వ్యూహం 
  • ఆ నేతతో రహస్య చర్చలు
  • మధ్యవర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారి
  • నీ ఓటమే లక్ష్యం అన్న సదరు నేత

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :  జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు పొడి చూపాయి ఆ  ఎమ్మెల్యే వైఖరిపై ఆగ్రంగా ఉన్న సదరు ఎమ్మెల్సీ రాబోయే ఎన్నికలలో ఆయనను ఓడించి తీరుతామని అవసరమైతే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధం కావడం అధికార పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్ష పార్టీలో చేరేందుకు సిద్ధం కావడంతో ఆ ఎమ్మెల్యే లో ఆందోళన మొదలైంది దీంతో ఆ నేతతో రాజీ కుదుర్చుకునేందుకు ముందుగానే కొంత సమయం ఇస్తే వచ్చి కలుస్తానని సదరు ఎమ్మెల్సీకి ఎమ్మెల్యే కోరినప్పటికీ ఆయన ససేమేరా అన్నట్లు తెలిసింది. సదరు ఎమ్మెల్సీ గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన నాగం జనార్దన్ రెడ్డిని ఓడించేందుకు అధికార పార్టీలో చేరారు ఆ ఎన్నికలలో నాగం ఓటమిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయడం వల్లే భారీ మెజార్టీతో ప్రస్తుత ఎమ్మెల్యే విజయం సాధించారని నియోజకవర్గంలో చర్చ సాగుతుంది నేడు అదే ఎమ్మెల్యేను ఓడించేందుకు ఎమ్మెల్సీ కంకణం కట్టుకోవడంతో నియోజక వర్గంలో రాజకీయ వేడి మొదలైంది. మరో ఐదు ఆరు మాసాలలో సాధారణ ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కార్యాలయం తో పాటు జిల్లా కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం నిర్వహించే బహిరంగ సభకు ఎమ్మెల్సీని ఆహ్వానించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించడం జరిగిందని ఆ సందర్భంలోనే కొంత రాజకీయ చర్చ సాగినట్లు ఊహగానాలు వెలువడ్డాయి. సదరు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే తో కలిసి ఎందుకు సుముఖంగా లేకపోవడంతో అదే పార్టీలో కొనసాగుతున్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి జోక్యం చేసుకొని ఎమ్మెల్సీ తో మాట్లాడినట్లు తెలిసింది దీంతో కొంత సమయం తీసుకున్న ఆయన ఎమ్మెల్యేకు వివరించడంతో ఇరువురు కలిసి ఎమ్మెల్సీ ఇంటికి వెళ్లినట్లు అక్కడ ఇరువురి మధ్య కొంత చర్చ సాగినప్పటికీ రాజీ మార్గాన్ని ఎమ్మెల్సీ తిరస్కరించడంతోపాటు తప్పకుండా నీ ఓటమికి కృషి చేస్తా అన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఈ చర్చల్లో ఎమ్మెల్సీ తనయుడు ఇటీవల రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నడంతో తన వెంట తిప్పుకొని రాజకీయ భవిష్యత్తును కల్పించడంతోపాటు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని ఎమ్మెల్సీ వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది పార్టీలోని ఇద్దరు నేతలు తనకు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే ఇరువురి మధ్య కొంత దూరం ఏర్పడిందని ఆయన ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చిన ఆయన ఒప్పుకోలేదని ఎన్నికల్లో తేల్చుకుందామని స్పష్టం చేసినట్లు వినిపిస్తుంది. బహిరంగ సభలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పాల్గొన్నప్పటికీ పార్టీ మారడంపై నియోజకవర్గంలో విస్తృతంగా రాజకీయ చర్చ సాగుతుంది.