జిల్లా కేంద్రంలో  ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 

జిల్లా కేంద్రంలో  ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 

ముద్ర ప్రతినిధి భువనగిరి : 75 వ భారత గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జెండగే భువనగిరి ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీలో జాతీయ పతాకావిష్కరణ గావించారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ పోలీస్ గౌరవ వందనం స్వీకారంచారు.ఈ సందర్భంగా ఆయన జిల్లాలో అమలు జరుగుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని తన ప్రసంగం ద్వారా వివరించారు. 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, అధికారులకు, పాత్రికేయులకు మరియు విద్యార్ధినీ,విద్యార్ధులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభివoదనములంటూ దేశమంతటా ఆనందోత్సాహాలతో గణతంత్ర దినోత్సవాన్ని పండుగలా జరుపుకునే పర్వదినమిది అన్నారు.

మన జాతీయ పతాకం రెపరెపలాడుతుంటే మనందరి హృదయాలు ఆనందంతో పరవశిస్తాయని ప్రపంచంలోనే గొప్ప  ప్రజాస్వామ్య దేశంగా భారత్ ను నిలుపుకునేందుకు, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి సారధ్యంలో  వ్రాయబడిన  భారత రాజ్యాంగము జనవరి 26, 1950  రోజున అమలులోకి వచ్చిందన్నారు. ఇలాంటి పర్వదినాన దేశ స్వాతంత్ర్యము కోసము పోరాటము సాగించిన అమర వీరులకు రాజ్యాంగ రూపకర్తలకు ఈ సందర్భముగా జోహారులు అర్పించి జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పధకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించారు. నూతన ప్రభుత్వo కొలువు తీరాక ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా మొదటి రెండు హామీలను ప్రమాణ స్వీకారం చేసిన 48  గంటలలో అమలు చేయడం జరిగిందన్నారు. మహాలక్ష్మి పథకం లో భాగంగా మహిళలకు RTC బస్సులలో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందన్నారు.


మహాలక్ష్మి పధకంతో మన జిల్లాలో రోజు  RTC బస్సులలో సగటున 35 వేల మహిళా ప్రయాణికులు ఉచితoగా ప్రయాణం చేయుచున్నారని ఇప్పటివరకు 8 లక్షల 51 వేల మంది మహిళలు RTC బస్సులలో ప్రయాణం చేయడం జరిగిందన్నారు.

వైద్య, ఆరోగ్య శాఖ:
జిల్లాలో 26 ప్రభుత్వ ఆసుపత్రులు, 1 ప్రైవేటు ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుచున్నారు.
రాజీవ్ ఆరోగ్య శ్రీ పధకం:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 9వ డిసెంబర్ 2023 తేదిన బీ.పి.ఎల్ కుటుంబాలకు మెరుగైన కార్పొరేట్ ఆరోగ్య బీమా  సహాయాన్ని  “రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం” ద్వారా 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు పంచడం జరిగింది. ఈ పథకం లో 1  వేయి 672 వైద్య సేవలు లబించునున్నట్లు చెప్పారు.

ప్రజా పాలన:
ప్రజలకు చేరువగా పాలనను అందించడానికి తెలంగాణ ప్రభుత్వము కట్టుబడి ఉంది అందుకే ప్రభుత్వo ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ప్రజా పాలన కార్యక్రమాన్ని 8 పని దినాలలో తేది 28-12-2023 నుండి 06-01-2024 నిర్వహించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆదేశముల ప్రకారం మన జిల్లాలో ప్రతి గ్రామ పంచాయితీలలో, అన్ని మునిసిపాలిటిలలో తేది 28-12-2023 నుండి 06-01-2024 వరకు గ్రామ సభలు నిర్వహించి, ప్రభుత్వ హామీలైన ఆరు గ్యారంటిలకు సంబందించిన మొత్తం 2 లక్షల 68 వేల 790 దరఖాస్తులు స్వీకరించి కంప్యూటరీకరణ చేయనైనది. త్వరలో లబ్దిదారుల ఎంపిక చేయబడును
1) మహిళలకు 2 వేల 500 రూపాయల ఆర్ధిక సహాయము కొరకు 2 లక్షల 32 వేల 53 దరఖాస్తులు.
2) 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కు 2 లక్షల 30 వేల 412  దరఖాస్తులు
3) రైతు భరోసా పథకము కొరకు 2 లక్షల 59 వేల 123 దరఖాస్తులు 
4) ఇందిరమ్మ ఇండ్లు పథకము గురించి 2 లక్షల 09 వేల 534 దరఖాస్తులు. 
5) గృహ జ్యోతి పథకము గురించి 2 లక్షల 09 వేల 899 దరఖాస్తులు 
6) చేయూత పథకము  గురించి 65 వేల 650 దరఖాస్తులు చేసుకున్నారు.


పౌర సరఫరాలు:
515 రేషన్ షాపుల ద్వారా మొత్తం 2 లక్షల 16 వేల 848 కుటుంబాలకు 4 వేల 217 మెట్రిక్ టన్నుల బియ్యం ఉచితముగా ఈ – పాస్ విదానము ద్వారా పంపిణి చేయడం జరుగుచున్నది. వానా కాలం 2023-24 సంవత్సరములో 314 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి  2 లక్షల 63 వేల  మెట్రిక్   టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం:
2023-24 ఆర్దిక సంవత్సరములో ఉపాధి హామీ కూలీలకు  22 లక్షల 33 వేల  పని దినాలు కల్పించి 80 కోట్ల 41 లక్షల రూపాయలు ఖర్చు చేయనైనది. 


స్వయం సహాయక సంఘాలు:
ఈ ఆర్ధిక సంవత్సరములో 511 కోట్ల 86 లక్షల లక్ష్యం నిర్ణయిSCSDF ఇప్పటివరకు 440 కోట్ల 63 లక్షల ఋణ సదుపాయం కల్పించనైనది.    

 
పెన్షన్లు:
జిల్లాలో ఈ పథకము ద్వారా 1 లక్షా 2 వేల 806 మంది  లబ్దిదారులకు నెలకు 25 కోట్ల 3 లక్షల రూపాయల పెన్షన్ ను పంపిణి చేయడము జరుగుచున్నది.


షెడ్యూల్డు కులముల అభివృద్ధి:
జిల్లాలోని 19 వసతి గృహములలో 1 వేయి 434 మంది విద్యార్థులకు, అలాగే 3  కళాశాల వసతి గృహాలలో 251 మందికి  ప్రవేశం కల్పించడం జరిగినదన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా 2023-24  సంవత్సరoలో 154  మంది విద్యార్థులకు 40 లక్షల 36 వేల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మరియు 2023-24  సంవత్సరoలో 16 మంది ఎస్.సి విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలో ప్రవేశం కల్పించడం జరిగిందని చెప్పారు.


గిరిజన సంక్షేమము :
జిల్లాలో 8 గిరిజన వసతి గృహాలలో 683 మంది విద్యార్ధులు వసతి పొందుతున్నారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ క్రింద 2023-24  సంవత్సరoలో ఇప్పటివరకు 782 విద్యార్ధినీ విద్యార్ధులకు 50 లక్షల 88 వేల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేయడము జరిగినది. 


వెనుకబడిన తరగతుల అభివృద్ధి:           
విదేశాలలో ఉనత విద్య చదువుకొనుటకు ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు మహాత్మ జ్యోతిభాపూలే బి.సి ఓవర్సీస్ విద్యా నిధి పధకం ద్వారా 20 లక్షల రూపాయల అందచేయడం జరుగుతుంది.


మైనారిటీల సంక్షేమo:
జిల్లాలో మూడు మైనారిటీ గురుకుల పాఠశాలలలో 850 మంది విద్యార్థులకు విద్యాబోధన జరుగుచున్నది మరియు జిల్లాలో 3 మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలలో 240 విద్యార్థులకు విద్యాబోధన జరుగుచున్నది. 


మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధులు:
జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం ద్వారా 4 ప్రాజెక్టుల పరిధిలో 901 అంగన్ వాడీ కేంద్రాలు పనిచేయుచున్నవి. 
ఆరోగ్య లక్ష్మి పధకం ద్వారా 9 వేల 542 మంది బాలింతలకు, గర్భవతులకు మరియు 13 వేల 581 మందికి 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు పోషక ఆహారం అందిస్తున్నాము. 


రోడ్లు మరియు భవనాలు:
SCSDF/STSDF పధకం క్రింద 2 బ్రిడ్జిలు మరియు ఒకటి రోడు నిర్మాణ పనులు 32 కోట్ల 30 లక్షల రూపాయల తో పురోగతిలో ఉన్నవి.
కేంద్ర ప్రభుత్వము నిధులతో ఒక రోడ్ పని  18 కోట్ల రూపాయలతో మరియు రైల్వే సేఫ్టీ క్రింద ఆలేర్ లో ఆర్ యు బి పని 11 కోట్ల రూపాయలతో మంజురై పనులు పురోగతిలో ఉన్నవి.


పంచాయితీరాజ్ ఇంజనీరింగ్:
PMGSY-III నిధులతో 16 రోడ్ల నిర్మాణ మరియు 5 బ్రిడ్జి నిర్మాణ పనులు 63 కోట్ల రూపాయలతో పురోగతిలో ఉన్నవి.
SDF 2021-22  103 కోట్ల 80 లక్షల రూపాయలతో 2 వేల 430 రోడ్లు, అంతర్గత మురికి కాల్వలు మరియు భవన నిర్మాణ పనులలో 985 పనులు పూర్తి అయినవి మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి.మినరల్ ఫండ్ పధకం క్రింద 673 పనులు 43 కోట్ల 80 లక్షల రూపాయలతో మంజూరి కాబడినవి. ఇందులో 424 పనులు పూర్తి అయినవి మిగిలినవి పురోగతిలో కలవు.


విద్యా శాఖ:
లక్ష్య కార్యక్రమం ద్వారా6 వేల 528 మంది 10 వ తరగతి  విద్యార్థులకు కొరకు ప్రత్యేకంగా తయారు చేసిన మాడ్యుల్ ద్వారా బోధన చేయడం జరుగుతుంది. 


ఇంటర్మీడియట్ విద్య:
జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 10 సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలు, 2 మహత్మా జ్యోతి రావు పూలే కళాశాలలు, 30 ప్రైవేటు జూనియర్ కళాశాలలు 2 మైనారిటీ జూనియర్ కళాశాలలు,  7 KGBV మరియు 7 ఆదర్శ కళాశాలలు ఉన్నవి. 


వ్యవసాయ మార్కెటింగ్:
జిల్లాలో ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, మోత్కూరు మరియు వలిగొండ మండల కేంద్రాలలో వ్యవసాయ మార్కెట్  కమిటీ కలవు. 2023-24 సంవత్సరoలో వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 3 లక్షల 77 వేల 55 క్వింటాళ్ళ పత్తిని కొనుగోలు చేయడం జరిగింది. 


విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక శాఖ:
జిల్లాలో అగ్ని ప్రమాదములను నియంత్రించే సామర్ధ్యం గల అధునాతన 3 అగ్నిమాపక  వాహనాలు “మల్టీ పర్పస్ టెండర్” మరియు మూడు “మిస్ట్ బుల్లెట్” లను అందుబాటులో ఉంచడం జరిగింది. గత సంవత్సరoలో జరిగిన అగ్నిమాపక కేంద్రాల పరిధిలో జరిగిన అగ్ని ప్రమాదాలలో 5 కోట్ల 55 లక్షల రూపాయల ఆస్తిని కాపాడటం జరిగింది మరియు అగ్ని ప్రమాదములలో నలుగురిని ప్రాణాలతో కాపాడటం జరిగింది.


పోలీస్ శాఖ : 
మన రాచకొండ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసు విధానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ మన రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.
నేరాల నియంత్రణకై జిల్లాలో అన్ని గ్రామాలలో, పట్టాణాలలో ముఖ్యమైన కూడళ్ళలో 15 వేల 102 సి.సి కెమెరాలను ఏర్పాటు చేయడం  జరిగిoది. జిల్లా ప్రజలలో సాంఘిక దురాచారాలపై అన్నీ ముఖ్యమైన ప్రాంతాలలో సాంస్కృతిక ప్రదర్శనలిస్తూ ప్రజలలో సరియైన అవగాహన కల్పిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పరిపాలనను  ప్రజలకు చేరువగా తీసుకెళ్ళి అభివృద్ధి ఫలాలను ప్రజలందరికి అందేటట్లు చేయడానికి సహకరిస్తున్న గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, బ్యాంకర్లకు, శాంతి భద్రతలు పరిరక్షిస్తున్న పోలీస్ అధికారులకు  ఈ సందర్బంగా  కృతజ్ఞతలు. విద్యార్థిని విద్యార్థులకు శుభాశీస్సులు. ఇదే స్పూర్తితో అందరము కలిసికట్టుగా పనిచేసి మన జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడదాం.  ఆ దిశలో మనమందరం అంకితమై శ్రమిస్తూ తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం.


కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.
కార్యక్రమంలో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను బహుకరించడం జరిగింది. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రభుత్వ విప్,  ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ ఎ.సందీప్ రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, డిప్యూటీ పోలీస్ కమీషనర్ రాజేష్ చంద్ర,  జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ ఏ.భాస్కరరావు, స్వాతంత్ర్య సమర యోధులు, సీనియర్ సిటీజన్స్, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, విద్యార్థిని విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.