కాంగ్రెస్ పార్టీది దాడుల సంస్కృతి కాదు

కాంగ్రెస్ పార్టీది దాడుల సంస్కృతి కాదు
  • వ్యక్తిగత దాడులను పార్టీలకు రుద్దడం సరైనది కాదు
  • ఎంపీపీ పై జరిగిన వ్యక్తిగత దాడికి జూపల్లికి సంబంధం ఏంటి
  • దాడికి పాల్పడిన వ్యక్తులను పెంచి పోషించింది ఎంపీపీ నే: కాంగ్రెస్ నాయకులు

ముద్ర,పానుగల్: దాడుల సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాదని మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి రవి కుమార్, మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రాము యాదవ్ లు అన్నారు. శుక్రవారం పానుగల్ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఎంపీపీ పై జరిగిన వ్యక్తిగత దాడిని కాంగ్రెస్ పార్టీకి నెట్టడం, మంత్రి జూపల్లి కృష్ణారావు పై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని వారన్నారు.గత పది యేండ్ల లో దాడులు చేసి దౌర్జన్యాలు చేసి అక్రమ కేసులు పెట్టి భూ కబ్జాలు,అన్యాయాలు చేసిన దౌర్భాగ్య ప్రభుత్వం భీఆర్ఎస్ ప్రభుత్వం అని అందుకే ప్రజలు తగిన బుద్ది చెప్పారన్నారు.ఐదేళ్ల నుంచి ఎవరినైతే మీరు పెంచి పోషించి దగ్గరుండి నేను దళిత బంధు ఇప్పిస్తా అని, వాళ్లను మాయమాటలు చెప్పి మోసం చేశారో, వాళ్లే ఈ రోజు మీపై దాడులు చేశారన్నారు.

2018 సాధారణ ఎన్నికల సమయంలో మీరు ఉసిగొలిపి పాన్ గల్ మండల కేంద్రంలో జూపల్లి కృష్ణారావు పై దాడి చేయమని పంపించిన విషయం మర్చిపోయారా అని,1995లో హిందూ,ముస్లింల మధ్య పానుగల్ గ్రామంలో అల్లర్లను సృష్టించి గందరగోళాన్ని దారితీసిన సంగతి మరిచిపోయారా అని ప్రశ్నించారు.మీరు దాడి చేస్తే సంసారం, మీ మీద దాడి చేస్తే వ్యభిచారామా అంటూ ప్రశ్నించారు.వ్యక్తిగత ఆరోపణలు చేయడం మానుకొని పదవీకాలం ఉన్నంతవరకు మండల అభివృద్ధికి పాటుపడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై అనవసరమైన ఆరోపణలు చేస్తే స్థానిక ఎన్నికల్లో మరొకసారి మీ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని వారు అన్నారు. సమావేశంలో సర్పంచులు విష్ణు నాయుడు, అంజి, మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ భాస్కర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవర్ధన్ సాగర్,పుల్లారావు, బ్రహ్మం, బాలస్వామీ,నరేందర్ గౌడ్,బాలరాజు యాదవ్,లోకా రెడ్డి, కరాటి గోపాల్, లోక నాయక్, దర్గయ్య,నిరంజన్ తదితరులు పాల్గొన్నారు