శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి - జగిత్యాల డిఎస్పి వెంకటస్వామి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు  జగిత్యాల డిఎస్పి వెంకటస్వామి అన్నారు.  జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ ఆదేశాల మేరకు డిఎస్పి వెంకటస్వామి ఆద్వర్యంలో  జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి లోని మోతే గ్రామంలో శనివారం ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా  డిఎస్పీ మట్లాడుతు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ద్వారా ప్రజల రక్షణ, భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం, ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని అన్నారు. గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, నేర రహిత గ్రామలుగా చేయలనే జిల్లా ఎస్పీ ఉద్దేశ్యం తోనే కార్యక్రమo నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేపర్లు లేని, సరైన  నంబర్ ప్లేట్స్ లేని 22 వాహనాలు సీజ్  చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాహనాలకు ఆర్ సి, ఇన్సూరెన్స్,  డైవింగ్ లైసెన్స్ కలిగివుండాలని, పత్రాలు లేని వాహనాలు నడిపేవారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, పాత వాహనాలు కొనేటప్పుడు డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని కొనాలని అన్నారు.

ఎవరైనా  అనుమానస్పదంగా తిరుగుతూ వుంటే వెంటనే పోలీసుల కు  లేదా డయల్ 100 కాల్ కు  ఫోన్  చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుముఖం పట్టడం తో పాటు ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు గాంజాయి రవాణా, విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  సి.ఐ అరిఫ్ అలీ ఖాన్, ఎస్.ఐ లు ఎఎస్ ఐ  లు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ , డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది, హోమ్ గార్డ్స్ పాల్గొన్నారు.