జనసమీకరణ మీద బీఆర్ఎస్..జాయినింగ్ ల మీద కాంగ్రెస్ ఫోకస్

జనసమీకరణ మీద బీఆర్ఎస్..జాయినింగ్ ల మీద కాంగ్రెస్ ఫోకస్
  • సిరిసిల్ల లో వేగం పెంచుతున్న కాంగ్రెస్ నేత కేకే
  • సిరిసిల్ల లో బీఆర్ఎస్ కు షాక్ ల  మీద షాక్ లు
  • బీఆర్ఎస్ ముఖ్య నేతల మండలాలపై కేకే ఫోకస్
  • కొండూరి, తోట, జిందం ఇలాకాలో కాంగ్రెస్ కు వలసలు
  • సిరిసిల్ల లో బీఆర్ఎస్ నేతల తీరుతో బీఆర్ఎస్ను వీడుతున్న పద్మశాలీ సంఘం నేతలు
  • పార్టీ మారుతుండని తెలిసిన పట్టించుకుంటలేని సిరిసిల్ల బీఆర్ఎస్ ముఖ్య నేతలు
ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..మంత్రి కేటీఆర్ ఇలాకాలో బీఆర్ఎస్ కు షాక్ల షాక్లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ జిల్లా నాయకత్వం, మండల నాయకత్వం సీఎం కేసీఆర్ పాల్గొనబోయే ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయడానికి జన సమీకరణ మీద ఫోకస్ చేస్తుంటే.. కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి రాజకీయంగా తన మాస్టార్ ప్లాన్ అమలు చేస్తూ.. కాంగ్రెస్ బలం పెంచేందుకు జాయినింగ్ల మీద ఫోకస్ చేస్తున్నారు. సిరిసిల్ల మంత్రి కేటీఆర్కు వ్యతిరేఖంగా ప్రచారం చేయడానికి భయపడే స్థాయి నుంచి బీఆర్ఎస్ పార్టీ తీరును విమర్శిస్తూ.. భీఆర్ఎస్ నాయకుల తీరును ఎండగడుతూ బీఆర్ఎస్ ను వీడుతున్నారు. కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. మంత్రి కేటీఆర్ ను ఓడించి.. కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డిని గెలిపిస్తామంటూ ప్రతీనా భూనుతున్నారు. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నాలుగుసార్లు గెలిచి ప్రజల మన్ననలు పొందారు. ఈ ఎన్నికల్లో లక్షా మేజార్టీ తగ్గకుండా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వలసలుపెరుగుతున్నాయి. క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు విస్మరిస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల తీరుతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఏకంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళ భర్త బీఆర్ఎస్ పట్టణధ్యక్షులు జిందం చక్రపాణి ఇలాకాల్లో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం బీఆర్ఎస్ అధిష్టానాన్ని కలవరపెడుతుంది.
బీఆర్ఎస్ టూ కాంగ్రెస్
మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే గా ప్రతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్ల పట్టణంలోని 9 వార్డులో సూమారు 50 మంది కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పట్టణ నాయకుల తీరును విమర్శిస్తూ.. తమ సమస్యలు పరిష్కరించడం లేదని చేరారు. పెద్దూర్ సమీపంలోని తురకాశీకాలనీలో చిన్న చిన్న సమస్యలు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెల్లిన ఇటు నాయకులుకానీ అటు అధికారులు కానీ స్పందించడం లేదని బీఆర్ఎస్ ను వీడారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు గంభీరావుపేట మండంలో ఏకచత్రధిపత్యమే.. రాజకీయంగా ఎదరుండదు. ఇక్కడ గోరంటాల మాజీ సర్పంచ్, మున్నురు కాపు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొమిరిశెట్టి విజయవలక్ష్మీ,తిరుపతి లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.తిరుపతి స్వయాన గంభీరావుపేట జడ్పీటీసీ రక్తసంబంధికుడు. జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సొంత మండలమైన ఎల్లారెడ్డిపేటలో స్థానిక బీఆర్ఎస్ నాయకుల తీరుకు వ్యతిరేఖంగా ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఒగ్గు బాలరాజు యాదవ్ దంపతులు కాంగ్రెస్ పార్టీల చేరారు. వీర్నపల్లి మండలంలో సైతం  మండలం టిడిపి ప్రెసిడెంట్ పరుమల్ల మల్లేష్ యాదవ్ , గొరంటాలా బిఆర్ఎస్ నాయకులు అరుణ్ గౌడ్ , జే. నాగరాజు, బొలగం శ్రీనివాస్ గౌడ్ , సాయి , సోము ,శేకర్ గారు,వరప్రసాద్ ,యాదగిరి ,ఏర్రం శ్రీకాంత్ రెడ్డి , సోలిపురం శ్రీకాంత్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిరిసిల్ల నియోజకవర్గంలో అత్యధిక ఓటుబ్యాంకు ఉన్న పద్మశాలీ సమాజిక వర్గానికి చెందిన వారు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వలస బాట పడుతున్నారు. సిరిసిల్ల లో ఇద్దరు బీఆర్ఎస్ నేతల అధిపత్య ధోరణి, అడ్డగోలు వ్యవహారాలతో బీఆర్ఎస్ పార్టీ నుంచి వైదొలిగి.. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.సిరిసిల్ల పద్మశాలీ సంఘం పట్టణ అధ్యక్షులు గోళి వెంకటరమణ ఆదివారం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిరిసిల్ల పట్టణంలో పద్మశాలీ సమాజిక వర్గానికి అధిక రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ.. వారికి ఉపాదీ అవకాశాల కల్పనకు సిరిసిల్ల నేతన్నలకు ఏడాదికి రూ.350 కోట్లు బతుకమ్మ చీరల అర్డర్లు, విద్యుత్ రాయితీ, సిరిసిల్ల పట్టణభివృద్ది, నేత భీమా తో పాటు సిరిసిల్ల చరిత్రలో ఎప్పుడు మున్సిపల్ పదవులు దాటని వారిని రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చి మంత్రి కేటీఆర్ ఇచ్చి గౌరవించారు. సిరిసిల్లకు రాష్ట్ర స్థాయి పదవి రావడంతోనే సిరిసిల్ల పద్మశాలీ సామాజిక వర్గంలో మేజార్టీ వర్గంలో వ్యతిరేఖ భావం ఏర్పడింది. నామీనేట్ పోస్టు పొందిన నేత సిరిసిల్ల పద్మశాలీ సమాజానికి ఐదు పైసల పని చేయకపోవడం పక్కనబెడితే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ నష్టం చేసే కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సిరిసిల్ల లో చర్చ కొనసాగుతుంది. బతుకమ్మ బిల్లుల కోసం సదరు నాయకుడి దగ్గరకు వెళితే ప్రభుత్వ బకాయిలు మెల్లగా వస్తాయి.. దమ్ముంటే అర్డర్లు చేయాలే లేకుంటే వట్టిగుండాలే అని నోరు జారీనిట్లు తెలిసింది. వచ్చిన బతుకమ్మ బిల్లులను కూడా ఆపి గతంలో ఇబ్బందులు పట్టడంతో మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో అవి రీలీజ్ చేశారు. రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చిన సిరిసిల్ల నేతన్నల సంక్షేమాన్ని, వస్త్ర పరిశ్రమ అభివృద్ది కార్యక్రమాలు మరిచి సిరిసిల్లకే పరిమితమై.. చిన్న చిన్న వార్డు రాజకీయాల్లో.. కార్యక్రమాల్లో పాల్గొంటూ.. సిరిసిల్ల ప్రజాప్రతినిధుల్లో చులకనయ్యారన్న అపవాదు మూటగట్టుకున్నారు. సిరిసిల్ల పట్టణం లో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు ఇతర పద్మశాలీ నాయకులను ఎవరిని రాజకీయంగా ఎదగనీయ్యకుండా రాజకీయ క్షక్ష సాధింపులకు పాల్పడుతుండటంతో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ యెల్లె లక్ష్మీనారయణ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వెళ్లారు. యెల్ల లక్ష్మీనారయణను మంత్రి కేటీఆర్ పిలపించుకోని మాట్లాడగా నామీనేటెడ్ పోస్టు నేత తనను కాదని ఎందుకు కేటీఆర్ వద్దకు వెళ్లావంటూ నోరు పారేసుకోవడంతో మనసు మార్చుకున్న యెల్లె లక్ష్మీనారయణ తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ తన అనుచర వర్గంలో చేరిపోయారు. సిరిసిల్ల పట్టణంలో పద్మశాలీ ముఖ్య నేతలంతా.. నామీనేట్ పోస్టు నేత తీరుతో వ్యతిరేఖం అవుతు వస్తున్నరని ఆరోపణలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో సిరిసిల్ల పద్మశాలీ సంఘం మంత్రి కేటీఆర్కు ఏకగ్రీవ తీర్మాణాలు చేస్తూ ఓట్లు బీఆర్ఎస్ అని ప్రకటించారు. కానీ సిరిసిల్ల నాయకుల తీరుతో సీన్ చేంజ్ అవుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డికి ఓటు బ్యాంకు పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.