హుజూర్ నగర్  బీ ఆర్ఎస్ లో బగ్గుమన్న అసమ్మతి

హుజూర్ నగర్  బీ ఆర్ఎస్ లో బగ్గుమన్న అసమ్మతి
  • ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ పదవులు అన్నింటికీ రాజీనామా చేసిన చల్ల శ్రీలత రెడ్డి
  • త్వరలో భవిష్యత్ కార్యాచరణ

ముద్ర నేరేడుచర్ల: హుజూర్ నగర్ నియోజకవర్గంలో అధికార పార్టీకి భారీ షాక్ తగిలింది ఎన్నికల నోటిఫికేషన్ సమీపిస్తున్న వేళ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఒక్కసారిగా అధికార బీఆర్ఎస్ లో అసమ్మతి భగ్గుమన్నది మొదటినుంచి ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ ఆయన ఒంటెద్దు పోకడలపై 
గలమెత్తుతున్న నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్ పర్సన్, 13వ వార్డు కౌన్సిలర్, నేరేడుచర్ల పట్టణ పార్టీ అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి బుధవారం అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్టు విలేకరుల సమావేశంలో ప్రకటించారు మున్సిపల్ చైర్ పర్సన్ గా, కౌన్సిలర్ గా రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి కి  అందజేశారు. టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా పత్రాన్ని సూర్యాపేట జిల్లా 
బీ ఆర్ఎస్ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ కు పంపినట్టు శ్రీలత రెడ్డి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

అధికార పార్టీకి భారీ షాక్

నేరేడుచర్ల మండలంలో టిఆర్ఎస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉండి పట్టణ పార్టీ అధ్యక్షురాలుగా పార్టీని ఇన్ని సంవత్సరాలుగా సమన్వయం చేస్తూ తన చాకచక్యంతో పార్టీని నడిపించిన నాయకురాలు పట్టణ పార్టీ అధ్యక్షురాలు అయిన చల్లా శ్రీలత రెడ్డి రాజీనామా చేయడంతో అధికార బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ గా చెప్పవచ్చు. ఇప్పటికే నియోజకవర్గంలో ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, ఎంపీటీసీలు జడ్పీటీసీలు పలువురు సర్పంచులు మండల పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ ఆంధ్రాలో సమావేశం కావటం ఎన్నికలు సమీపించే తరుణం ఆసన్నం కావడంతో ఇన్నాళ్లుగా లో లోపల ఉన్న  అసమ్మతి ఒక్కసారిగా బయటపడటం హుజూర్నగర్ నియోజకవర్గంలో బీ ఆర్ఎస్ పార్టీని ఒక పెద్ద కుదుపు కుదిపినట్టు అయింది. చల్లా శ్రీలత రెడ్డి రాజీనామాతో నేరేడు చర్ల మండలంలో అనేక రాజకీయ మార్పులు సమీకరణాలు చోటు చేసుకోనున్నాయి. ఎమ్మెల్యే పై గుర్రు గా ఉన్న మిగతా నాయకులు కూడా త్వరలో తమ దారి తాము చూసుకోనున్నట్టు సమాచారం.రాజీనామా చేసిన చల్లా శ్రీలత రెడ్డి తన భవిష్యత్తు కార్యక్రమాన్ని త్వరలో వెల్లడిస్తానని పేర్కొన్నారు. మొత్తానికి చల్లా శ్రీలత రెడ్డి బీ ఆర్ఎస్ నుండి బయటకు రావడంతో ఇంకా అనేకమంది నాయకులు ఆమె వెంట రావడానికి సంసిద్ధంగా ఉన్నారని త్వరలోనే నేరేడుచర్ల మండలంలో బీ ఆర్ఎస్ పార్టీ కి రాజీనామాలు ప్రారంభమవుతాయని రాజకీయ వర్గాల బోగట్ట. మరి కొద్ది రోజులు వేచి చూస్తే గాని నేరేడుచర్ల మండలం బీ ఆర్ఎస్ పార్టీలో ఉండేది ఎవరో పార్టీని విడిచి వెళ్ళేది ఎందరో తెలియనుంది