ఇంటి ఇంటికి బిఆర్ఎస్ ప్రచారం.. బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జూలకంటి జీవన్ రెడ్డి

ఇంటి ఇంటికి బిఆర్ఎస్ ప్రచారం.. బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జూలకంటి జీవన్ రెడ్డి

ముద్ర, చివ్వెంల: మండల కేంద్రంలోని ఇంటింటికి బిఆర్ఎస్ పార్టీ ప్రచారం గురువారం మండల పార్టీ అధ్యక్షులు జూలకంటి జీవన్ రెడ్డి, ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అది కారు గుర్తుకే ఓటు వేసి మంత్రి జగదీష్ రెడ్డి ని 50 వేల ఓట్ల మెజార్టీ గెలిపించాలని, ఇంటింటికి ప్రచారం మొదలు పెట్టానని అన్నారు. అన్ని గ్రామ పంచాయతీలలో బిఆర్ఎస్ నాయకులు, సర్పంచులు ఇంటికి ఇంటింటికి గడపగడపకు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దాదాపు 20 ఏళ్ల అభివృద్ధిలో నోచుకోని సూర్యాపేట, కేవలం 10 ఏళ్లలో  సూర్యాపేట అభివృద్ధిలో ముందంజలో ఉంది. టిఆర్ఎస్ అభ్యర్థి గుంటకల్ జగదీశ్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో చీమల మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు జూలకంటి సుధాకర్ రెడ్డి, మిర్యాల గోవింద్ రెడ్డి, అంజిరెడ్డి, ఏర్పుల నగేష్, బుర్రి నవీన్, వడ్డేపల్లి రాములు, కోడి వెంకన్న, శిగ వెంకన్న, శిగ లక్ష్మయ్య, టీం సభ్యులు పాల్గొన్నారు