రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలి

రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలి
double engine government should come in the state

కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ
స్టేషన్ ఘన్ పూర్ (ముద్ర న్యూస్):  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇక్కడి ప్రజల కందాలంటే తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ అన్నారు.  జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం పామునూరులో లోక్ సభ ప్రవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పై నిర్వహించిన అవగాహన సదస్సుకు కేంద్ర సహాయ మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ కల్పించిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇంటింటికి చేరాయి అన్నారు.  ఇళ్లు లేని నిరుపేదల కోసం 3 కోట్ల 60 లక్షల  ఇళ్లు కట్టించారు.అదే అయితే రాష్ఠ్రంలో పథకం పేరు మార్చి డబుల్  బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం కట్టించే పరిస్థితిలో లేదన్నారు. ప్రధాన మంత్రి కట్టించిన ఇళ్లకు కరెంట్, మరుగుదొడ్లు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, ఉచితంగా ఇచ్చిన ఘనత నరేంద్ర మోదీ అన్నారు. ఒక్కొక్క కుటుంబానికి  రూ. ఐదు  లక్షల ఉచితంగా వైద్యం చేయుటకు ఆయుష్మాన్ భవ కార్డులు ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోంది అన్నారు.  

రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనతో సింగిల్ ఇంజన్ సర్కార్ నడుస్తోందని డబుల్ ఇంజన్ సర్కారుతోనే పేదవాడికి సంక్షేమం, రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం అవుతుంది అన్నారు.  బీజేపీ  రాష్ట్ర కార్యదర్శి గుండె విజయ రామరావు మాట్లాడుతూ సాధ్యం కానీ హామీలతో ప్రజలను మభ్య పెట్టి సీఎం కేసీఆర్ దోచుకుంటున్నాడని ఆరోపించారు. నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్లు   40 మాత్రమే కట్టాడన్నారు. కేంద్రం కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్ల   డబ్బులు రూ. 970 కోట్లను దారి మల్లించాడని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ నిర్ణయం వల్ల దేశంలో కరోనా నియంత్రణ జరిగిందన్నారు. నియోజకవర్గంలో దళిత బంధు కోసం రూ. 2 లక్షల చొప్పున నాయకులు డబ్బులు వసూలు చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో జిల్లా అధ్యక్షుడు దశమంత రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఉమారాణి, నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్, అశోక్, ఇనుగాల యుగేందర్ రెడ్డి, ఐలోని అంజిరెడ్డి నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు.