ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే...

ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే...

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని శుభ మస్తు ఫంక్షన్ హాల్ లో మత్స్యశాఖ   ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్  పోస్టర్ ను జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఆవిస్కరించారు. ఈ నెల 8 నుంచి 10 వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషరీస్ అధికారి దామోదర్,జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి, హెచ్ సి ఎ జిల్లా మెంబర్ దావా సురేష్, నాయకులు వంశీ బాబు, సంగెం రమేష్, దామోదర్, తదితరులు పాల్గొన్నారు.