ఆర్యవైశ్యులకు ఉత్తమ్ ఐదు హామీలు.. కోదాడ లో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం

ఆర్యవైశ్యులకు ఉత్తమ్ ఐదు హామీలు..  కోదాడ లో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం

ముద్ర ప్రతినిధి , కోదాడ :  కోదాడ వాసవి భవన్ లో శుక్రవారం ఆర్యవైశ్య సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నల్లగొండ ఎంపీ , మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో పదమూడు రోజులలో కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని , ఆర్య వైశ్యులకు కాంగ్రేస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు . ఆర్య వైశ్యులకు రాజకీయాలలో సముచిత స్థానం కల్పిస్తామని , ఆర్య వైశ్యులు కాంగ్రేస్ పార్టీకి అండగా ఉండి ఆశీర్వదించాలని ఆయన కోరారు . కోదాడ , హుజూర్ నగర్ నియోజక వర్గాలలో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థులకు ఆర్య వైశ్యులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు . కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి రాగానే కోదాడ లో ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేస్తానని , వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది రానివ్వకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు . ఈ సందర్భంగా ఆర్య వైశ్య నాయకులు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందించారు . ఆర్య వైశ్య సంఘం భవనానికి స్థలం , నిధులు , పేద ఆర్య వైశ్యులకు ఇంటి స్థలం , నిధులు , కోదాడ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీ , మండలాల లో ఆర్య వైశ్యులకు రాజకీయ ప్రాధాన్యత , నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు , ఆర్య వైశ్య విద్యార్థులకు విదేశీ విద్య కు ఫీజుల విషయంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు . ఓరుగంటి ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రేస్ అభ్యర్థిని పద్మావతి రెడ్డి , మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు , జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మాశెట్టి అనంత రాములు , వంగవీటి రామారావు , వెంపటి వెంకటేశ్వరరావు , గరిణె కోటేశ్వర రావు , శ్రీధర్ , పయిడిమర్రి వెంకట నారాయణ , కందిబండ వెంకట్ తదితరులు పాల్గొన్నారు .