కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ బిఆర్ఎస్ పార్టీలోకి చేరిక

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్  బిఆర్ఎస్ పార్టీలోకి చేరిక

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్ బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో 9వ వార్డు నుండి జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ ఆధ్వర్యంలో సూర్యాపేట శాసనసభ బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బంటు చొక్కయ్య గౌడ్ తోపాటు 200 మంది బిఆర్ఎస్ పార్టీ లో జాయిన్ అవడం జరిగినది. ఈ సందర్భంగా బంటు చొ క్కయ్య గౌడ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి రావడం,  అభివృద్ధి జరగడం చూసి మంత్రి తో పాటు కలసి పనిచేయాలని ఆసక్తితో, ఆనందంతో బి.ఆర్.ఎస్ పార్టీలోకి రావడం జరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గుంటకండ్ల జగదీశ్ రెడ్డి  కారు గుర్తుకు ఓటు వేసి మన అభివృద్ధి మనమే చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ సూర్యాపేట పట్టణ అధ్యక్షులు సవరల సత్యనారాయణ,బూర బాల సైదులు గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు బైరు వెంకన్న, 9వ వార్డ్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు  గుండగాని నాగభూషణం, మద్దూరి కుమార్,నీలాల లక్ష్మయ్య విద్యాసాగర్,ఈదుల లక్ష్మయ్య,బొడ్డు దుర్గయ్య, టీవీ సాయికుమార్, కంకణాల సందీప్,షేక్ నయీమ్ వెలుపుల క్రాంతి కుమార్, అనుములపూరి రమేష్, మైనంపాటి అరుణ, నర్సింగ్ నాగమ్మ, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

టేకుమట్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 మంది బీ ఆర్ఎస్ లో చేరిక

సూర్యాపేట నియోజకవర్గం టేకుమట్ల గ్రామం కాంగ్రెస్ పార్టీకి చెందిన 100  మంది శుక్రవారం సూర్యాపేట శాసనసభ్యులు సూర్యపేట నియోజకవర్గ బీ ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వీరిలో ఇద్దరు వార్డు మెంబర్లు కూడా ఉన్నారు.  కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వార్డు మెంబర్ల తో సహా వీరంతా గతంలో పటేల్ రమేష్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు.