పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించిన మాజీ ఎమ్మెల్యే విజయరణరావు

పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించిన మాజీ ఎమ్మెల్యే విజయరణరావు

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. పార్టీ లోకీ వచ్చిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనిస్తున్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు. 
జిల్లాలోని సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామానికి చెందిన వారు, శివపల్లి 0 గ్రామానికి చెందిన జనగామ శ్రీధర్ రావు (వార్డు సభ్యులు), బండి ఉదయ్ కిరణ్ (వార్డు సభ్యులు), అసరి సంపత్ (వార్డు సభ్యులు), బెజ్జెంకి కనకయ్య (వార్డు సభ్యులు), జూపెల్లి శ్రీనివాస్ రావు, జూపెల్లి తిరుమల రావు, ఆసరి రవీందర్ యాదవ్, లింగంపెల్లి కోమురయ్య, జూపేల్లి శ్రీధర్ రావు, ఆసరీ శ్రీనివాస్ రావు, ఆసరి హరీష్ రావు విజయరమణ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.  రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపదంలోకి తీసుకురావాలని విజయ రమణారావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.