మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏంపీపీ  గుండాగని కవిత రాములు గౌడ్   మహాత్మా గాంధీ  చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అయుంసా మార్గంలో దేశానికిస్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ అడుగుజాడల్లో యువత నడిచి గాంధీ ఆశయాలను నెరవేరేలా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య , గ్రంధాలయ చైర్మన్ గోపగాని రమేష్ , ఏపీవో కృష్ణ, ఐకేపీ సీసీ యాదగిరి , టైపిస్ట్ దశరథ  తదితరులు పాల్గొన్నారు.