కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
  • కుటుంబ పాలనలో బంధి అయిన తెలంగాణ నూతన కాంగ్రెస్ ప్రభుత్వంతో విముక్తి
  • కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు,ఎంపీటీసీ భీమనపల్లి సైదులు

ముద్ర,మునుగోడు:కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ జన్మదినం రోజే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని,కుటుంబ పాలనలో బంధి అయిన తెలంగాణ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంతో విముక్తి కలుగుతుందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు భీమనపల్లి సైదులు అన్నారు.నాలుగు కోట్ల ప్రజల  స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీ 77 వ జన్మదిన వేడుకలను శనివారం  మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ మండల కమిటీ   ఆధ్వర్యంలో కేక్  కట్ చేసి ఘనంగా నిర్వహించారు . అనంతరం వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కుటుంబం బందీ అయిన తెలంగాణ రాష్ట్రం లోని పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన   రెండు రోజుల్లోనే పేద ప్రజల సంక్షేమ పాలన సాగించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం , 10 లక్షల ఆరోగ్య బీమా పథకం అమ్ముల్లోకి తీసుకురావడంతో పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు , బ్లాక్ కాంగ్రెస్  అధ్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డి ,మాజీ ఎంపీపీ పోలగోని సత్యం , కాంగ్రెస్ సీనియర్ నాయకులు నన్నూరి విష్ణువర్ధన్ రెడ్డి , మేకల మల్లయ్య ,  కుంభం చెన్నారెడ్డి, యువజన కాంగ్రేస్ మండల అధ్యక్షుడు నక్క వెంకన్న,కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బోయపర్తి లింగయ్య , బీసీ సెల్ మండల అధ్యక్షుడు చారి  , మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎండి రఫీక్ , తాటికొండ సైదులు ,  అన్వర్ , పట్టణ ప్రధాన కార్యదర్శి కాటం వెంకన్న ,  మాధగోని యాదయ్య , సాగర్ల లింగస్వామి , మాజీ ఎంపీటీసీ పందుల భాస్కర్ , జిట్టగొని యాదయ్య, మాజీ సర్పంచ్ మాదగోని రాజేష్, పందుల నరసింహ , మధు ప్రసాద్, బీసం విజయ్, పందుల పర్వతాలు,సూర్య ప్రకాష్, బొడ్డు యాదయ్య, మునుగోటి సాయి, పందుల ఉదయ్, బండారు మల్లేష్, వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తదితరులు ఉన్నారు.