కొండగట్టు ఆలయ పవిత్రతను కాపాడండి...

కొండగట్టు ఆలయ పవిత్రతను కాపాడండి...
MLA Sunke Ravi Shankar review meeting
  • హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి...
  • ఆలయ సిబ్బందితో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం...

ముద్ర, మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయ సిబ్బందితో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఆలయంలోని లోపాలను సరిదిద్దుకోవాలని, స్వామివారి పవిత్రను కాపాడాలని సిబ్బందికి సూచించారు. ఆలయంలో సానిటేషన్ నిర్వహణ సరిగా లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి గర్భాలయంకు అలారం ఏర్పాటు చేయడంతో పాటు, ఇంటి దొంగలపై నిఘా పెట్టాలన్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి, హనుమాన్ జయంతి ఏర్పాట్లపై చర్చించారు.

జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా ఉండాలని ఈవోని ఆదేశించారు. ఆలయ భూములు పూర్తిగా సర్వే చేయించాలని పేర్కొన్నారు. వరదకాల్వ నుంచి లిఫ్ట్ ద్వారా సంతోళ్లలొద్దికి అక్కడి నుంచి కొండపైకి నీళ్లు... మెట్లదారి పూర్తి స్థాయిలో అభివృద్ధి తదితర పనులు తొందరగా చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో ఈవో సoకటాల వెంకటేష్, తహసీల్దార్ సుజాత,  పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.