బీర్పూర్ లో మహిళా సంఘాల 14 లక్షల నిధులు గొలుమల్

బీర్పూర్ లో మహిళా సంఘాల 14 లక్షల నిధులు గొలుమల్

ఏళ్లు గడుస్తున్నా రికవరీ కానీ స్త్రీనిధి రుణాలు.
గతంలో సీసీని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్న అధికారులు.
 సారంగాపూర్ ముద్ర: బీర్పూర్ మండల కేంద్రంలో మహిళా సంఘాల ఖాతల్లోని 14 లక్షల 50 వేల రూపాయల నిధులు మాయమైనట్లు తెలుస్తుంది. సుమారు గత 8 సంవత్సరాలుగా స్త్రీ నిధి రుణాలు రికవరీ కావడం లేదు. ఇదే విషయమై గతంలో ఇక్కడ పనిచేసిన సి సి పుష్పలతను జిల్లా అధికారులు సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. అయినా ఇప్పటివరకు  స్త్రీ నిధి రికవరీ కాలేదు. బీరుపుర్ లక్ష్మీనరసింహస్వామి గ్రామైక్య సంఘం లోని 15 మహిళా సంఘాలు సభ్యులు 2017 సంవత్సరంలో సరస్వతి, వందన, శ్రీ శ్రీనివాస, విఘ్నేశ్వర ,ఆదిలక్ష్మి, ఆరంజ్యోతి, శ్రీజ ,వైష్ణవి ,శ్రీ రాజరాజేశ్వర ,శ్రీ వెంకటేశ్వర, శ్రీలక్ష్మి మహిళా సంఘాల ఖాతాల్లో 14 లక్షల 40 వేల రూపాయలు జమయ్యాయి. ఈ  రూపాయలను మహిళా సంఘాల సభ్యులు తీసుకోకపోవడంతో వాటిని రిటర్న్ పంపారు. తిరిగి పంపిన రూపాయలును గ్రామైక్య సంఘంలో జమ చేశారు. ఈ  రూపాయలను సదర్ మహిళా సంఘాల ఖాతాల నుంచి తీసివేయాల్సి ఉండగా, వాటిని సిసి వివో లు గ్రామ ఐక్య సంఘంలో ఎవరైనా మహిళా సంఘాల సభ్యులు శ్రీనిధి రుణాలు కట్టని వారి కి ఈ  రూపాయలను సర్దుబాటు చేశారు.

అలా మొత్తం రూపాయలను గ్రామైక్య సంఘంలోని మహిళా సంఘాల సభ్యులకు సర్దుబాటు చేసినట్లు సమాచారం. దీంతో పైన పేర్కొనబడిన మహిళా సంఘాల లో నీ సభ్యుల పేర్లపై అప్పటినుండి ఇప్పటివరకు స్త్రీని రుణాలు పెండింగ్ లో వస్తు ఉన్నాయి. వీటిని రికవరీ చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో అలానే పెండింగ్ లో  ఉండిపోయాయి. అలాగే ఈ 14 లక్షల రూపాయలతో పాటు మరో 9,80,000 వరకు లెక్కలు తేలనట్లు అధికారులు చర్చించుకుంటున్నారు. 2013 నుండి 2016 వరకు మహిళా సంఘాల సంబంధించిన రికార్డులు లేకపోవడం  పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా శ్రీనిధి రుణాల గోల్మాల్ విషయంలో అక్కడ పనిచేసిన సిసి పుష్పలతను జిల్లా ఉన్నత అధికారులు గతంలో సస్పెండ్ చేశారు కానీ రెండు నెలలకే ఇదే స్త్రీ నిధి రుణాల రికవరీ పై మళ్లీ పోస్టింగ్ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు రికవరీ కాకపోవడం కొసమెరుపు. బీర్పూర్ మండల కేంద్రం తో పాటు కోల్వాయి గ్రామంలోను  మహిళా సంఘాలలో కూడా పెద్ద ఎత్తున స్త్రీనిధులుణాలలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తున్నది.

స్త్రీ నిధి రుణాలు రికవరీ కావడం లేదు.
శ్రీనిధి రుణాల రికవరీ అసిస్టెంట్ మేనేజర్ రమ
బీర్పూర్ మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహస్వామి గ్రామైక్య సంఘంలో 2017 సంవత్సరంలో 14 లక్షల నలభై వేల రూపాయలు 9 సంఘాల ఖాతల్లో జమ అయ్యాయని ఆ రూపాయలు వారు తీసుకోకపోవడంతో గ్రామైక్య సంఘం ఖాతాలో జమ కాగా వాటిని రెగ్యులర్గా స్త్రీ నిధి రుణాలు కట్టని వారికి సర్దుబాటు చేశారన్నారు. కానీ 9 సంఘాలలోని సభ్యులు తీసుకొని రూపాయలను ఆన్లైన్లో వారి పేరు తొలగించాల్సి ఉండగా అలా చేయకపోవడంతో ఇప్పుడు వారి పైన వారి పేరు పైన పెండింగ్ చూపిస్తుందని అన్నారు. అదే తాము తీసుకొని డబ్బులకు బ్యాంకులో తమ పేరిట బకాయి ఉండడం ఏంటని మా పేరు మీద వచ్చిన డబ్బులను మరొకరికి ఇవ్వడం వాటిని రికవరీ చేయకపోవడం అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనమని తమ పేర్ల మీద వచ్చిన రుణాలను వాడుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని తమకు బ్యాంకు నుంచి ఎలాంటి బకాయి లేదని నేడు ఇప్పించాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై  ఉన్నతాధికారులను వివరణ కోరగా ఏప్రిల్ మాసంలో సమావేశం నిర్వహించి రుణాలను రికవరీ చేస్తామన్నారు.