స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ సమర్థ వంతంగా అమలు చేయండి - కలెక్టర్ వరుణ్ రెడ్డి

స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ సమర్థ వంతంగా అమలు చేయండి - కలెక్టర్ వరుణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: స్వచ్ఛ సర్వేక్షణ్ ను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ వరుణ్ రెడ్డి అధికారులకు సూచించారు.
బుధవారం    స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీన్ పై  కలెక్టర్  వరుణ్ రెడ్డి  సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ  జిల్లాలోని  15  గ్రామాలను ఎంపిక చేసి  మోడల్ గ్రామాలుగా  తీర్చిదిద్దాలని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల పారిశుధ్య స్థితిని అంచనా వేసే కీలకమైన  పరిమాణాత్మక, గుణాత్మక  స్వచ్ఛ భారత్ మిషన్ పారామితులపై  వాటి  పనితీరు ఆధారంగా ర్యాంకులను కేటాయించడం  జరుగుతుందని అన్నారు.
గ్రామాల్లో  ఓ డి ఎఫ్ ప్లస్  మార్గదర్శకాలకనుగుణంగా  మరుగుదొడ్లు నిర్మించుకోవాలని,  తడిపొడి చెత్త సక్రమ నిర్వహణ,  వాల్ పెయింటింగ్స్,  తదితర   గ్రామాల్లో  అన్ని సౌకర్యాలు, సదుపాయాలు కల్పించి   ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని, అందుకనుగుణంగా  అధికారులు  ప్రత్యేక శ్రద్ధకనబర్చి  ఈ సారి జిల్లా కు  అవార్డు లు తీసుకురావాలని  అన్నారు.ఈ సమావేశం లో  సీఈఓ సుధీర్,  డి ఆర్ డి ఓ విజయలక్ష్మి,  సంబంధిత  అధికారులు, తదితరులు పాల్గొన్నారు.