ముదిరాజులకు సముచిత స్థానం కల్పించాలి

ముదిరాజులకు సముచిత స్థానం కల్పించాలి
  • ముదిరాజ్ కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వేల కోట్ల నిధులు కేటాయించాలి
  • ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ముదిరాజ్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: రానున్న ఎన్నికల్లో ముదిరాజ్ కులస్తులకు అన్ని రాజకీయ పార్టీలు సముచిత స్థానం కల్పించాలని తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ముదిరాజ్ అన్నారు.   జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో ఆ సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు . జనాభా దమాషా ప్రకారం ముదిరాజ్ కులస్తులకు ఎన్ని ఎమ్మెల్యే ఎంపీ సీట్లు అరువులు అన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ -డీలో ఉన్న ముదిరాజులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీ-ఏలోకి మార్చాలని సూచించారు .లేని పక్షంలో బీసీ లో ఉన్న ఏ ,బి ,సి డి ,ఇ, కాకుండా కొత్తగా ఎఫ్ గ్రూప్ ఏర్పాటు చేసి ముదిరాజులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు . గతంలో ముదిరాజుల జీవన పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన బీసీ కమిషన్ ముదిరాజులను బిసి డి గ్రూపు నుంచి గ్రూపు నుంచి బీసీ ఏలోకి మార్చాలని ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వడం జరిగిందని కానీ కొంతమంది హైకోర్టు వెళ్లగా ప్రభుత్వం కోర్టులో సరైన వాదనలు చేయలేక నిర్లక్ష్యం వహించడంతో ఈ నివేదిక ఆగిపోయింది అన్నారు.  

ముఖ్యంగా ముదిరాజ్ కులస్తుల జీవనోపాధి అయిన మత్స్య శాఖలో వెంటనే సభ్యత్వాలు అందజేయాలన్నారు.  ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వేల కోట్లు కేటాయించాలని , చెరువులో కుంటలపై పూర్తి హక్కులు ముదిరాజులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు . 50 ఏళ్లకు పైబడిన ముదిరాజ్ మత్స్య కార్మికులకు రూపాయల 5000 వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలని, బీమా పథకాన్ని అమలు చేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన అసెంబ్లీ టికెట్లలో ఏ ఒక్క ముదిరాజుకు అవకాశం కల్పించకపోవడం దారుణమని వెంటనే ముదిరాజ్ కులస్తులకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు .త్వరలో ముదిరాజుల ఐక్య కార్యాచరణ రూపొందించుకునేలా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు ముదిరాజుల సత్తా ఏంటో చూపుతామని తెలిపారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇంటి అచ్చమ్మ ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంట సత్యం ముదిరాజ్, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు చిలుమల సురేష్, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు బైరు సైదులు ముదిరాజ్, గంట శివకుమార్ ముదిరాజ్, లింగ బోయిన సత్యనారాయణ ముదిరాజ్ ,కంటూ నాగరాజు ముదిరాజ్, శీలం వెంకీ ముదిరాజ్ మాధవి ముదిరాజ్, పాండవుల కృష్ణ ముదిరాజ్, బైరు రామ్మూర్తి ముదిరాజ్ ,యాట సైదులు ముదిరాజ్, గంగరబోయిన వెంకన్న ముదిరాజ్ ,ఆరె నరసయ్య ముదిరాజ్ పాల్గొన్నారు