కాంగ్రెస్ పార్టీలో చేరిక

కాంగ్రెస్ పార్టీలో చేరిక

ముద్ర.వీపనగండ్ల: మండల పరిధిలోని పుల్గర్ చేర్ల గ్రామానికి చెందిన టిఆర్ఎస్, బిజెపి పార్టీలకు చెందిన కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సుభాన్, శివకృష్ణ, పులగూరి నరసింహ, మల్లెపూల గోపాలకృష్ణ, భాను ప్రకాష్, శీలం కురుమయ్య, బాలకృష్ణ తో పాటు మరో 13 మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి రఘునాథ్ రెడ్డి, ఉప సర్పంచ్ నరేష్ కుమార్ లు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు, కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గెలుపు ఖాయమని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు అందించడం జరుగుతుందని రఘునాథ్ రెడ్డి, నరేష్ కుమార్ అన్నారు.